లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో మాధవి
వరంగల్: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం నిర్వహించిన దాడుల్లో ఇద్దరు లంచావతారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల తాహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ మే 9న మీసేవలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో గోపాల్ నుంచి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఎమ్మెార్వో మాధవి తోపాటు ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ. 5వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు.

పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు.. ఎమ్మార్వో మాధవి రూ. 5 వేలు, ధరణి ఆపరేటర్ రూ. 1000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఎమ్మార్వోపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
విచారణ చెపడితే అనేక కీలక అంశాలు బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. తహసీల్దార్ ఏసీపీ పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు బాధితులు. తహసీల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని వాపోయారు.
మరోవైపు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్. రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నానాజీపూర్ గ్రామ పంచాయతీతోపాటు సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్ నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications