తెలుగు టెక్కీలను వీసాలపై అడిగాడు: తర్వాత కాల్చాడు
కాల్పులు జరపడానికి ముందు షూటర్ తెలుగు టెక్కీలను కాన్సాస్‌లోని బార్‌లో కొన్ని ప్రశ్నలు వేశాడు. తొలి ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవడంతో రెచ్చిపోయాడు.
హైదరాబాద్: కాల్పులు జరపడానికి ముందు తెలుగు టెక్కీలను షూటర్ వారి వీసాల గురించి అడిగాడు. "ఇప్పుడు మీ వద్ద ఏం వీసాలున్నాయి. మీరు ఇక్కడ చట్టవ్యతిరేకంగా ఉంటున్నారా" అని తనను, తన మిత్రుడిని షూటర్ అడిగినట్లు కాల్పుల్లో గాయపడిన ఆలోక్ మాడసాని ద న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పాడు.
ఆ ప్రశ్నలకు తాము స్పందించలేదని అన్నారు. తాను, శ్రీనివాస్ కూచిభొట్ల బార్‌లో కూర్చున్నామని, అక్కడికి ఆడం పురింటన్ వచ్చాడని చెప్పారు. తమపక్కనే అతను కూర్చున్నాడని తెలిపారు. "ప్రస్తుతం మేం ఏ వీసాతో ఇక్కడ ఉన్నామో చెప్పమని అతను అడిగాడు, చట్టవిరుద్ధంగా ఉంటున్నామేమో చెప్పమన్నాడు" అని మాడసాని వివరించారు.

ఆ ప్రశ్నలకు తాము సమాధానం ఇవ్వలేదన్నారు. కొందరు తెలివితక్కువ పనులు చేస్తూ ఉంటారని, ఇతను ఆ స్థాయి దాటి ముందుకు వెళ్ళాడని చెప్పారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసాని అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ చట్టబద్ధంగానే అమెరికాలో ఉంటున్నారు.
కాన్సాస్‌లోని ఓ బార్‌లో హంతకుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన విషయం తెలిసిందే. అతని మిత్రుడు మాడసాని ఆలోక్ గాయపడ్డాడు.
అమెరికాలో హత్యకు గురైన కూచిబోట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఉన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications