పన్ను మినహాయింపు వేస్ట్: గౌతమీపుత్ర శాతకర్ణిపై సీఎంలకు వరుస షాక్‌లు

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని కరీంనగర్ కౌన్సెల్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

కరీంనగర్: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని కరీంనగర్ కౌన్సెల్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడం వృథా అని వారు అంటున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి - కొత్త కోణం: 'అసలు'పై చర్చ

ఈ సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనిపై కరీంనగర్ కౌన్సెల్ సభ్యులు ఆగ్రహిస్తున్నారు. ఈ సినిమాకు పన్ను ఎందుకు మినహాయింపు ఇచ్చారో అర్థం కావడం లేదంటున్నారు.

Karimnagar council members questions on tax expemption for Goutamiputra Satakarni

కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తొలుత తెలంగాణ, ఆ తర్వాత ఏపీలో వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే, ఈ మినహాయింపు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించేలా చేస్తోంది.

శాతకర్ణి సినిమా వట్టి అవాస్తవాలతో కూడిన చిత్రమని పలువురు చారిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆ సినిమాకు పన్ను మినహాయింపు సరికాదంటున్నారు. మరోవైపు, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి.. రుద్రమదేవి సినిమాకు ఇవ్వకపోవడంపై దర్శకులు గుణశేఖర్ చంద్రబాబును ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+