నేనూ సీఎం అవుతా, 2014 నుంచి అన్నీ తేలుస్తా..! కవిత కామెంట్స్..!
తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ పార్టీలో ఉండి తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ తో పాటు అధికారం అనుభవించిన కల్వకుంట్ల కవిత అధికారం కోల్పోయాక మాత్రం వారిపైనే పేరెత్తకుండా ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కవిత.. ఇవాళ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న వారిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తనకు కూడా టైం వస్తుందని, తాను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని కల్వకుంట్ల కవిత ఇవాళ వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని సొంత కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. అలాగే తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతానంటూ కవిత మరో హెచ్చరిక కూడా చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి జనబాట పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వారు కూడా కవితకు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే కొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పైనా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇవాళ కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపారు.
కవిత తన నోటీసుల్లో తనపై, తన భర్త అనిల్‌పై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. వీటిపై వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత.. అనంతరం మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో కవిత పర్యటనలు సాగాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications