కవిత వారసుడు పొలిటికల్ ఎంట్రీ, తల్లితో కలిసి..!!
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం రాజకీయ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ప్రస్తుతం జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా తన కార్యాచరణ కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బీసీ బంద్ కు కవిత మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో కలిసి కవిత ధర్నా చేసారు. అయితే, ఆ ధర్నాలో కవిత కుమారుడు ప్రత్యక్షమయ్యారు. బీసీ అనుకూల నినాదాలు చేయటంతో.. ఒక్క సారిగా రాజకీయ చర్చ అటు మళ్లింది. కవిత కుమారుడు ధర్నాలో పాల్గొనటం ఆసక్తి కరంగా మారుతోంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు రాజకీయ ఎంట్రీ ఇప్పుడు చర్చగా మారుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత.

ఖైరతాబాద్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా... బీసీ బంద్‌లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. తల్లితో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో.. కవిత కోసం కుమారుడు వచ్చారా.. లేక, రాజకీయంగా తొలి అడుగు నేడు పడిందా అనే చర్చ రాజకీయంగా మొదలైంది.
అటు ఏపీలో షర్మిల సైతం తన కుమారుడు రాజకీయ ఎంట్రీకి పావులు కదుపుతున్నారు. ఇదే విధంగా కవిత సైతం తన కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక.. కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు.

దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని కవిత పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications