ఒక్క సారిగా ఎమోషనల్ అయిన కేసీఆర్..!!

బీఆర్ఎస్ అధినేత..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. కల్వకుంట్ల కవిత ఐదు నెలల తర్వాత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్​ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు.కూతురిని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నేతలు సైతం ఉద్వేగంతో కనిపించారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్​పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ ను కలిసారు. ఎర్రవల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ ను కలిసేందుకు తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో పుట్టింటికి వచ్చిన కవితకు ఎర్రవల్లి గ్రామస్థులు మంగళహారతి పట్టి ఘనస్వాగం పలికారు. అనంతరం కేసీఆర్ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు.

Kavitha meets KCR at Farm house after release from Jail becomes emotional

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. కవిత అరెస్ట్ గురించి పార్టీ సమావేశంలోనూ కేసీఆర్ స్పందించారు. అయితే, కవిత జైల్లో ఉన్న సమయంలో కేసీఆర్ పరామర్శకు వెళ్లకపోవటం రాజకీయంగా అనేక రకాల చర్చలకు కారణమైంది. అయితే, తమను వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత శపథం చేసారు. తనను అక్రమంగా నిర్బంధించారని చివరికి సత్యమే గెలిచిందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+