బాబుది డైరెక్షన్,, రేవంత్ రెడ్డిది యాక్షన్: కవిత

వరంగల్: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది డైరెక్షన్‌ అయితే రేవంత్‌రెడ్డిది యాక్షన్‌ అని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ విషయానికి సీబీఐ విచారణ కోరే చంద్రబాబు ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని, దొంగే దొంగ అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. కొన్ని కారణాలతోనే కేబినెట్‌లో మహిళలకు అవకాశం రాలేదని కవిత తెలిపారు.

చంద్రబాబు ప్రతి చిన్న విషయానికి సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తారు గానీ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో మౌనంగా ఎందుకు ఉన్నారని ఆమె అడిగారు. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు అన్న విషయాన్ని ఒక్కసారి చంద్రబాబు ఆలోచించాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందని ఆమె అన్నారు.

Kavitha says Revanth Reddy acted in the direction of Chandrababu

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రాంత బిడ్డలు వాటిని తిప్పికొడుతూనే ఉంటారని స్పష్టంచేశారు. ఆదివారం వరంగల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. నోటుతో ఓటు కొనాలనుకున్న చంద్రబాబు పన్నాగం బయటపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయనే దోషిగా చూడాలని, ఈ వ్యవహారంలో చంద్రబాబునే ఏ-1గా భావించి ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రజలు భావిస్త్తున్నారని కవిత అన్నారు.

ఇంత జరిగినా ఇంకా ఈ ప్రాంత టీడీపీ నేతలు చంద్రబాబు మోచేతి నీళ్లకు ఆశపడి ఈ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని హెచ్చరించారు. రేవంత్‌ను నడిపిన చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీలు కేంద్రహోం మంత్రికి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్త్తున్నారని చెప్పారు.

తెలంగాణ జాగృతి ఉద్యమంలో ఏ విధమైన పాత్రను పోషించిందో బంగారు తెలంగాణ సాధనలోనూ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు. అందు లో భాగంగానే డెడికేటెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి శత్రుపూరిత వైఖరి లేదన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అనేక అంశాలు ఇంకా సాధించుకోవాల్సి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+