వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పుడు మీ బిడ్డనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. నేను అందరిలాంటి సీఎంను కాదన్నారు.

బీంరావ్ బాడా స్థలం అక్కడి పేదలకే చెందుతుందని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు గాంధీ భవన్ కోసం అక్కడి పేదలను బలవంతంగా పంపించారని, అది పేదోళ్లకే చెందుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కావాలంటే తాను మరోచోట జాగాను ఇస్తానని చెప్పారు. తానే వారితో మాట్లాడుతానని చెప్పారు. వారి తీరు అన్యాయమన్నారు. మరోవైపు, ఓయు ల్యాండ్ తీసుకుంటామన్న కేసీఆర్ వ్యాఖ్యల పైన ఉస్మానియా విశ్వవిద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు.

కేసీఆర్

కేసీఆర్

నేను పాత ముఖ్యమంత్రుల మాదిరి కాదని, చీపుళ్లతో ఫొటోలు దిగిపోయేవాడిని కాదని, బస్తీల్లో పేద బతుకులు బాగుపడే వరకూ నాలుగేళ్లపాటు నెలనెలా నిరంతరంగా స్వచ్ఛ హైదరాబాద్ కొనసాగిస్తానని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇళ్లు కట్టుకొనివుంటే వాటికి పట్టాలిస్తామని, ఇల్లు లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఇస్తామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ నాల్గవ రోజు బుధవారం ముగింపు సందర్భంగా పాత బస్తీలోని డబీర్‌పుర, సయ్యద్ సాబ్‌కా బడా, సైదాబాద్, ఐఎస్ నగర్, సరూర్‌నగర్, దిల్‌షుక్‌నగర్ రైత్ బజార్, ఎన్టీఆర్ నగర్, బంజారావాడా తదితర ప్రాంతాల్లో సిఎం సుడిగాలి పర్యటన జరిపారు.

కేసీఆర్

కేసీఆర్

ఇళ్లులేని వారికి ఉతచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ఐదు నెలలలో పూర్తి చేస్తామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

అయితే పేదల కోసం ఇళ్లు కట్టిద్దామంటే కొందరు దొంగలు పేదల ముసుగులో దూరి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయాలని చూస్తుంటారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలనిహెచ్చరించారు.

కేసీఆర్

కేసీఆర్

బస్తీలో పేదల బతుకులు బాగుపడే వరకూ నిరంతరంగా స్వచ్ఛ హైదారాబాద్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని, నెలకు ఒకరోజు బస్తీలకు అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తూనే ఉంటారన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఇప్పటి మాదిరిగా మళ్లీ చలికాలంలో నాలుగు రోజులపాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలలో నివాసాలు ఏర్పర్చుకున్న పేదలకు వాటిని ఉచిత క్రమబద్ధీకరణకు జీవో 58 ప్రకారం దరఖాస్తులు కోరగా లక్ష 28 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు.

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

ఇందులో ఎలాంటి వివాదాలు లేని లక్షమందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇళ్లు లేనివారికి ప్రభుత్వమే ఎంత ఖర్చయినా భరించి ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

భీంరావు బడాలో గతంలో పేదలు ఇళ్లు కట్టుకున్న చోటనే తిరిగి ఇళ్లు నిర్మించి ఇస్తామని, కాంగ్రెస్ ఆఫీస్ కట్టుకోవడానికి మరోచోట స్థలం ఇస్తామని ఆ పార్టీ నేతలకు చెబుతానని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఎన్టీఆర్ నగర్‌లో పేదలు ఇళ్లు కట్టుకున్న స్థలం తమదేనని కొందరు కోర్టుకు వెళ్లగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఇళ్లు ఉన్నట్టయితే దాన్ని కూల్చివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లుకట్టిస్తామంటూ కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలతో విద్యార్థి లోకం భగ్గుమంటోంది. సీఎం నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు దిగుతోంది.

 రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

బుధవారం ఓయూలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర, ర్యాలీలు నిర్వహించారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు.

 రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముస్లిం స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఎంఎస్‌వో) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

అంతకు ముందు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు. మై హోమ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు కబ్జాచేసిన భూములను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓయూ భూములను కాపాడాలంటూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

 రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

ఓయూ భూముల జోలికొస్తే ఊరుకోమని ప్లకార్డులు ప్రదర్శించారు. ఓయూలో అడుగుపెడితే కేసీఆర్‌ను తరిమి కొడతామని హెచ్చరించారు. కాగా, ఓయూ భూములపై సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆయన కుర్చీనే పెకిలిస్తామని పీడీఎస్‌యూ హెచ్చరించింది.

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

తెలంగాణ రాగానే రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్ని పేదలకు పంచిపెడతానన్న కేసీఆర్‌ నేడు ఎందుకు ఆ భూముల జోలికి పోవడంలేదని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్ష్, పద్మాలయ, అన్నపూర్ణ, రామానాయుడు, గురుకుల భూములను పేదలకు పంచండి అని ప్లకార్డ్

 రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

రోడ్లపై కేసీఆర్: ఆర్ఎఫ్‌సీ, ఎన్ కన్వెన్షన్‌పై ఓయు ప్రశ్న

ఓయూ భూములు ఇస్తామంటూ వాగ్దానాలు చేసి బస్తీ ప్రజలు, విద్యార్థుల మధ్య సీఎం కేసీఆర్‌ చిచ్చుపెట్టారని ఓయూ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఓయూ భూములను ప్రాణాలు అడ్డుపెట్టయినా కాపాడుకుంటామని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బాబులాల్ నాయక్‌ పేర్కొన్నారు.కాగా, కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన ఓయూ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కాగా, ఓయూ భూముల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సీఎం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బషీర్‌బాగ్‌లోని పీజీ న్యాయకళాశాల వద్ద విద్యార్థులు హాల్‌ టికెట్లను దహనం చేసి లా పరీక్షను బహిష్కరించారు.

English summary
KCR Adamant on Taking Surplus Land of Osmania University, Students Protests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X