KCR Birthday: తెలంగాణ మాజీ సీఎంకు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం విషెస్
ఆయన నోరు విప్పితే అక్షరాలు తూటాలై పేలుతాయి.. ఆయన మాట్లాడిటే సాహిత్యం పరవళ్లు తొక్కుతుంది. ముళ్ళ కంచెలను దాటే మేధస్సు.. శత్రువును సైతం మెప్పించే రాజనీతిజ్ఞత ఆయన సొంతం! చరిత్రను చదివేవాళ్లు కొందరైతే.. చరిత్రను తిరగరాసేవాళ్లు మరికొందరు.. కానీ, ఒక చరిత్రను సృష్టించి.. ఆ చరిత్రకే చిరునామాగా మారిన ఏకైక నాయకుడు కేసీఆర్! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్..కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఏపీ మాజీ సీఎం జగన్,కేసీఆర్ మధ్య బంధం అనిర్వచనీయమని రాజకీయ వర్గాల్లో.. ఇరు పార్టీల శ్రేణుల్లో టాక్. పరిస్థితులు బట్టి ఇరువురు నేతలు కూడా ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అండగా నిలుస్తారు. గత డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు నాడు తాడేపల్లిలో బీఆర్ఎస్ నేతలు జగన్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఏర్పాటు చేసిన కట్ ఔట్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. నేడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ఈ క్రమంలోనే కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన విషెస్ తెలియజేశారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆరోగ్యం, ఆనందం, శాంతి మరియు దీర్ఘాయుష్షు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము." అని పోస్ట్ చేశారు.
Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026
KCR Birthday: చంద్రబాబు, పవన్
ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను." అని పోస్ట్ చేశారు
Warm birthday greetings to former Telangana Chief Minister, Shri K Chandrashekar Rao garu. I pray for his good health and long life.@KCRBRSPresident
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2026
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కే చంద్రశేఖర రావు గారెకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడాయన. మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను శ్రీ కేసీఆర్ గారెకి అందిచాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని పత్రికా ప్రకటన విడుదల చేశారు
శ్రీ కె.సి.ఆర్. గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! pic.twitter.com/3dQX8xxOMU
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 17, 2026
అసాధ్యం అన్నచోటే సుసాధ్యం చూపి.
"తెలంగాణ రావడం అసాధ్యం" అన్న మాటను "తెలంగాణ రావడం ఖాయం" అని మార్చిన ధీశాలి కేసీఆర్. 2001లో ఒంటిచేత్తో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, 'సింహగర్జన'తో ఉద్యమ శంఖారావం పూరించారు. 2009లో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజధాని ఢిల్లీని సైతం గడగడలాడించింది. "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" అన్న నినాదం కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది.
దశాబ్దాల కలను సాకారం చేసిన 'రాష్ట్ర నిర్మాత'
60 ఏళ్ల పోరాటాన్ని తార్కిక ముగింపుకు చేర్చి, 2014లో స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత ఆయనది. కేవలం ఉద్యమకారుడిగానే కాకుండా, అద్భుతమైన పరిపాలనాదక్షుడిగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారు. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి, ఎండిన గడ్డపై పచ్చని పంటలు పండించిన "ఆధునిక భగీరథుడు" కేసీఆర్.
సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్
రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి.. ఇలా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. "మిషన్ భగీరథ" ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడం ఒక చారిత్రాత్మక విజయం. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు.
మాటల మాంత్రికుడు.. మేధావి
కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప సాహిత్యవేత్త, వక్త. వేల పుస్తకాలు చదివిన మేధావి. ఆయన ప్రసంగం మొదలైతే జనం మంత్రముగ్ధులై వింటారు. తెలంగాణ యాసకు, భాషకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టి, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన సంస్కర్త ఆయన.
ఓటమి ఎదురైనా, గెలుపు వరించినా ఆయన ధైర్యం చెదరదు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనొక అన్స్టాపబుల్ ఫోర్స్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications