రేవంత్ సర్కార్ కు ఊపిరాడనివ్వని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కేసీఆర్!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయింది. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలులోను వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

కవిత బయటకు వస్తే కేసీఆర్ ప్రజల్లోకి... టాక్
అయితే డిసెంబర్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేలా సమరానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్.ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికోసం ఆయన వ్యూహ రచన చేస్తున్నారని కూడా అప్పట్లో టాక్ వినిపించింది.

KCR is preparing an action plan to target revanth govt

ప్రభుత్వం పైన యుద్ధానికి సన్నద్ధం
అయితే కేసీఆర్ ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రత్యర్థి పార్టీలపైన పెద్ద ఎత్తున పోరాటం చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే డిసెంబర్ నెలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఎన్ని గ్యారెంటీలను అమలు చేసింది? ప్రజలకు ఇచ్చిన ఎన్ని హామీలను నెరవేర్చింది? అనే అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రభుత్వంపైన యుద్ధానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

గత ఎన్నికల ఓటమి తర్వాత బయటకు రాని కేసీఆర్
డిసెంబర్ నెలలో గులాబీ దళపతి కేసీఆర్ రంగంలోకి దిగుతారని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కెసిఆర్ పెద్దగా బయటకు రాలేదు. రాష్ట్రంలో రకరకాలుగా పాలిటిక్స్ నడుస్తున్న ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తిన సమయంలో కూడా కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి తానున్నానని హామీ ఇవ్వలేదు.

గులాబీ బాస్ వ్యూహం ఇదే
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది సమయం ఇచ్చి, అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో జరిగిన మేలేంటో నష్టమేంటో ప్రజలకు అర్థమైన తర్వాత అప్పుడు తాను ప్రజలకు చెప్పినా బాగుంటుందని భావించే కేసీఆర్ బయటకు రాలేదని, ఇదే గులాబీ బాస్ వ్యూహం అని గులాబీ శ్రేణులు చెప్తున్నారు.

కేసీఆర్ రంగంలోకి అప్పుడే..
డిసెంబర్ నెలలో కేసీఆర్ రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఊపిరాడదని కెసిఆర్ ని తట్టుకోవడం అంత ఈజీ కాదని గులాబీ నేతలు చెబుతున్నారు. మరి డిసెంబర్లోనైనా కేసీఆర్ బయటకు వస్తారా లేదా అనేది ముందు ముందు తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+