పెళ్లి వయసులో ఉన్న మహిళలకు కేసీఆర్ చేయూత.!కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లతో ప్రోత్సాహం.!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరుపేద మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకం కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ లకు సంబంధించిన చెక్కులను లబ్ది దారులకు అందించారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ వివాహాలకు ఆర్థిక సహాయం అందించే పథకం. జిహెచ్ఎంసి వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ అనేది తెలంగాణ ప్రభుత్వం ద్వారా జిహెచ్ఎంసి వ్యాప్తంగా వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం రూపొందించిన ఒక వినూత్న సంక్షేమ పథకమని, నగరవ్యాప్తంగా పేద ప్రజలందరికీ ఈ పథకం ద్వారా 1,00,116 రూపాయల సహాయం అందిస్తుందని విజలలక్ష్మి తెలిపారు

mayorgadwalavijayalakshmi-

బాల్య వివాహాలను నిరోధించడం మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 18 ఏళ్లు పైబడిన యువతులకు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలకు మించని వారు ఈ పథకానికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా హిల్స్ డివిజన్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతే కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పధకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, ఇంతటి బృహత్కర పధకాలు రూపొందించిన సీఎం చంద్రశేఖర్ రావు గొప్ప దార్శనికుడని మేయర్ అభివర్ణించారు.

mayorgadwalavijayalakshmi-

ఇలాంటి పధకాల గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగాల్సి ఉంటుందన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వాలు రూపొందించలేదని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా నిజమైన లబ్ది దారులకు నేరుగా చెక్కుల చేరే విధంగా ఈ రెండు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈనెల 24 ఔరంగబాద్ లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఈ పధకాల గురించి దేశ ప్రజలకు సవివరంగా వివరిస్తామన్నారు దానం నాగేందర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+