బాబును కలిసి, బెజవాడ దుర్గకు కెసిఆర్ ముక్కుపుడక: మల్లన్న కళ్యాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీసమేతంగా సోమవారం నాడు విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్‌లో వారు బెజవాడ చేరుకుంటారు.
ఏపీ సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయం వెళ్లి, కుటుంబ సమేతంగా తాను నిర్వహించనున్న ఆయత చండీయాగానికి రావాలని ఆహ్వాన పత్రిక అందిస్తారు. అనంతరం బెజవాడ కనకదుర్మమ్మ ఆలయానికి వెళ్లి ముక్కుపుడకను సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తాను కనకదుర్గమ్మ తల్లికి ముక్కుపుడక పెడతానని కెసిఆర్ విభజనకు ముందు మొక్కుకున్నారు.
కెసిఆర్ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ఆయత చండీయాగానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి సహా ప్రముఖులను కెసిఆర్ ఆహ్వానించనున్నారు. నాలుగు పేజీల ఆహ్వాన పత్రికలో... ఎర్రవెల్లిలోని యాగశాలకు ఎలా వెళ్లాలో కూడా మార్గాన్ని పొందుపర్చారు.
23వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు రుక్మాభట్ట నరసింహ స్వామి ధార్మిక ప్రవచనం ఉంటుంది. రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల గేయ కథాగానం ఉంటుంది. 24న మధ్యాహ్నం మూడు గంటలకు గన్నమరాజు గిరిజా మనోహర బాబు ధార్మిక ప్రవచం. రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల గేయ కథా గానం.
25న మధ్యాహ్నం మూడు గంటలకు పురాణం మహేశ్వర శర్మ ధార్మిక ప్రవచం ఉంటుంది. రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల గేయ కథాగానం. 26వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు దోర్భల ప్రభాకర శర్మ ధార్మిక ప్రవచనం. రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల గేయాకథాగానం ఉంటుంది. మరోవైపు కెసిఆర్‌కు కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి ఆహ్వానం అందింది.

కొమురవెళ్లి మల్లన్న వివాహానికి ఆహ్వానం
జనవరి 3న వరంగల్ జిల్లా కొమురవెళ్లి మల్లన్న దేవాలయంలో జరగనన్న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి హాజరు కావాలని వరంగల్ జిల్లా నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు.

కొమురవెళ్లి మల్లన్న వివాహానికి ఆహ్వానం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు, ఆలయ అర్చకులు, సర్పంచి భిక్షపతి తదితరులు శనివారం ముఖ్యమంత్రిని కలిశారు.

కొమురవెళ్లి మల్లన్న వివాహానికి ఆహ్వానం
జనవరి 3న వరంగల్ జిల్లా కొమురవెళ్లి మల్లన్న దేవాలయంలో జరగనన్న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి హాజరు కావాలని వరంగల్ జిల్లా నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు.

చంద్రబాబు , కెసిఆర్
బెజవాడలో చంద్రబాబు క్యాంప్ కార్యాలయం వెళ్లి, కుటుంబ సమేతంగా తాను నిర్వహించనున్న ఆయత చండీయాగానికి రావాలని కెసిఆర్ ఆహ్వాన పత్రిక అందిస్తారు. అనంతరం బెజవాడ కనకదుర్మమ్మ ఆలయానికి వెళ్లి ముక్కుపుడకను సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications