కేజ్రీవాల్ ఓటమి.. కేసీఆర్ కు బిగ్ షాక్, బీఆర్ఎస్ కు నయా టెన్షన్!
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి చెందడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. కేజ్రీవాల్ ఓటమి కెసిఆర్ ఫ్యామిలీలో టెన్షన్ కు కారణంగా మారింది. కేజ్రీవాల్ ఓటమి తర్వాత ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని పోలీసులను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం సంచలనంగా మారింది.
కేజ్రీవాల్, కవిత మెడకు బిగియనున్న ఉచ్చు?
సచివాలయంలోని ఆర్డర్ ఫైల్స్ బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పడంతో కేజ్రీవాల్ తో పాటు, కవిత మెడకు కూడా మళ్లీ ఉచ్చు బిగుస్తుంది అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును వదిలి పెట్టరని, కేజ్రీవాల్ ను, కవితను మరో మారు జైలుకు పంపే అవకాశం ఉందని ప్రస్తుతం రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక్క దెబ్బకు రెండు పార్టీలను గల్లంతు చేసే బీజేపీ వ్యూహం
ఢిల్లీ ఎన్నికలలో పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీ పక్కా వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీని, బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా బిజెపి తన వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇక ఈ క్రమంలో తాజాగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి గెలవబోతుందని బండి సంజయ్ ట్వీట్ చేయడం ప్రస్తుతం జరుగుతున్న చర్చకు ఊతమిస్తుంది.
లిక్కర్ కుంభకోణం తాలూకా ఫైల్స్ కోసమే షాకింగ్ నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని భావిస్తున్న వేళ కేజ్రీవాల్ తో పాటు కవితను మరోసారి జైలుకు పంపేందుకు బిజెపి అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే లిక్కర్ కుంభకోణం మొత్తాన్ని బయటకు తీస్తామని బిజెపినేతలు ప్రకటనలు చేశారు. తాజాగా సీఎం ఆఫీస్ నుంచి ఒక ఫైల్ కూడా బయటకు వెళ్ళకూడదని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం లిక్కర్ కుంభకోణం తాలూకా ఫైల్స్ కోసమేనని చర్చ జరుగుతుంది.
కవితకు టెన్షన్
ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ ఓటమి పాలు కావడం ఇటు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా షాక్ అనే చెప్పాలి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే బిజెపి ఈసారి గట్టిగానే కేజ్రీవాల్, కవిత ఇద్దరిని జైలుకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ ఓటమికి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కారణం కాగా, ఇక ఈ కేసులో కవిత మరోమారు జైలుకు వెళితే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు చావు దెబ్బ తప్పదు. ఈ చర్చ ఇప్పుడు బిఆర్ఎస్ వర్గాలలో కూడా ఆందోళనకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications