అగ్నిప్రమాద ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య; వైఎస్ షర్మిల ఫైర్!!

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో, గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి సంఘటన స్థలంలో ఒకరు, అక్కడ నుండి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రగాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ప్రస్తుతం చీమలపాడు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఉదయం ప్రమాదం జరిగిన సమయంలో సంఘటన స్థలంలో మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ సందీప్, మంగు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరోకరు ఖమ్మం ఆసుపత్రి నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

ys sharmila responds on fire accident

ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఖమ్మం జిల్లా చీమలపాడులో బాణాసంచా పేలిన దుర్ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు షర్మిల.అమాయాకులతో పాటు పోలీసులు, జర్నలిస్టులకు తీవ్రగాయాలు కావడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు .

మృతిచెందిన వారి కుటుంబాలకు 50లక్షల రూపాయల పరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు రూ.20లక్షల పరిహారం, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్ల సమావేశాలకు అనుమతులు ఇవ్వని పోలీసు పెద్దలు, పనికిమాలిన బీఆర్ఎస్ పార్టీ మీటింగులకు ఎలా పర్మిషన్లు ఇస్తారు? అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. మండుటెండలో బాణాసంచా పేలుస్తుంటే ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మీటింగ్ కు, ప్రమాదానికి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎంపీ సిగ్గులేకుండా చెబుతున్నాడని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమాయకుల ప్రాణాలు అగ్నికి ఆహుతి చేశారని మండిపడ్డారు. కాగా అగ్నిప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హైదరాబాద్ కు మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+