ఖమ్మం-విజయవాడ (NH-163G) గ్రీన్‌ఫీల్డ్ హైవే.. ఆ ప్రాంతాలకు మహర్దశ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర భారీగా నిధులను కేటాయించి పని చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపి అనేక జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఖమ్మం నుంచి విజయవాడకు కేవలం గంట 15 నిముషాల్లోనే

ఖమ్మం జిల్లా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. భారతమాల ప్రాజెక్టు కింద నిర్మాణం జరుగుతున్న ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-163G) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ హైవే పూర్తయితే ఖమ్మం నుంచి విజయవాడకు కేవలం 75 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోలిస్తే ఈ మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది.

Khammam-Vijayawada Greenfield Highway construction progressing rapidly Travel time to reduce to just 75 minutes

నాగపూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ నేషనల్ హైవే

మొత్తం 89.43 కిలోమీటర్ల పొడవున్న ఈ నాలుగు వరుసల హైవేను మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. నాగపూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగమైన ఈ రహదారి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్యం, లాజిస్టిక్స్‌ను బలోపేతం చేస్తుంది. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు 10-12 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

23 శాతం పనులు పూర్తి

ప్రస్తుతం 23 శాతం పనులు పూర్తయ్యాయి. భూసేకరణ 90 శాతం ముగిసింది. ప్యాకేజీ-1లో వి.వి.పాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు 43 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన ప్యాకేజీల్లో మట్టి పనులు, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. క్లోవర్ లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌లు, అత్యాధునిక టోల్ ప్లాజాలు, అండర్‌పాస్‌లు నిర్మించి స్థానికుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సరుకు రవాణాతో పాటు యువతకు ఉపాధి

ఈ హైవే పూర్తయితే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి తూర్పు తీరం వరకు సరుకు రవాణా సులభతరం అవుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వేగంగా మార్కెట్లకు చేరుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది.

ఉస్మానియా ఆస్పత్రి రికార్డ్.. దేశంలోనే ఒకేసారి ఒకేవ్యక్తికి 5 అవయవాల మార్పిడి!
ఉస్మానియా ఆస్పత్రి రికార్డ్.. దేశంలోనే ఒకేసారి ఒకేవ్యక్తికి 5 అవయవాల మార్పిడి!

రెండు రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా నేషనల్ హైవే

తెలంగాణా నుండి ఏపీలోని విజయవాడకు వెళ్ళే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించటమే కాకుండా అన్ని విధాలుగా రెండు రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధికి ఈ జాతీయ రోడ్డు ప్రాజెక్టు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+