హైదరాబాద్‌లో కిడ్నాపైన వివాహిత కోల్‌కతాలో: నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో కిడ్నాప్‌నకు గురైన వివాహిత రాధిక ఆచూకీ లభించింది. గత కొన్ని రోజుల క్రితం ఓ కిడ్నాపర్ మహిళను కిడ్నాప్ చేసి ఆమె భర్తను డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్ కోసం విస్తృత గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో కిడ్నాపర్‌ను పోలీసులు కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాపర్ మహిళకు పరిచయస్థుడేనని విచారణలో వెల్లడైంది. మాయమాటలు చెప్పిన నిందితుడు, ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కిడ్నాపర్‌ను సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం. నిందితుడు బీహార్‌కు చెందినవాడని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications