కిల్లర్ జితేందర్ అరెస్ట్.. హత్య కేసులో కొత్త కోణం..
రెజిమెంటల్ బజార్ : ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న జితేందర్ సింగ్ అనే వ్యక్తిని మధ్య మండల టాస్క్ ఫోర్స్ సహాయంతో అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పెంటర్ గా పనిచేసే నిందితుడు జితేందర్ (40) ఈ నెల 2వ తేదీన ఈ హత్యలకు పాల్పడ్డాడు.
నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుమాయున్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు ఇదివరకే మూడు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. దత్తానగర్ ప్రాంతంలో ఉంటూ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు.
కాగా.. కొద్దిరోజుల క్రితమే తల్లి చనిపోవడంతో సోదరుడి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత నెల 29 న అన్న కుమారుడు, వదినలతో ఏదో విషయమై గొడవపడ్డాడు. దీంతో సోదరుడి కుటుంబ సభ్యులు అతన్ని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీజీపీ..
అప్పటినుంచి సోదరుడి ఇంటి పక్కనే ఉన్న మరో గదిలోకి మకాం మార్చాడు. అయితే తనను ఇంటి నుంచి బయటికి అన్న కొడుకు, వదినలపైన కక్ష పెంచుకున్న జితేందర్ ఆ ఇద్దరిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

నిందితుడు జితేందర్ ను పట్టుకున్న టాస్కఫోర్స్
దీంతో ఈ నెల 2వ తేదీన పని ముగించుకుని సైకిల్ పై వస్తున్న సమయంలో, ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తిని తన అన్న కుమారుడిగా భావించి బండరాయితో అతని తలపై బాది చంపేశాడు.

టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు జితేందర్
ఇక అక్కడినుంచి రెడ్ హిల్స్ జావీద్ మసీద్ దగ్గరకు చేరుకున్న .జితేందర్ అక్కడ ర్యాంప్ పై నిద్రిస్తున్న వృద్దురాలిని తన వదినగా భావించి తలపై షాబాద్ రాయితో మోది హత్య చేశాడు.

కిల్లర్ జితేందర్ అరెస్ట్.. హత్య కేసులో కొత్త కోణం..
అయితే రెండు హత్యలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలించిన పోలీసులకు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications