రుణమాఫీ కాలేదని వేలాది ఫోన్లు వస్తున్నాయ్: కాంగ్రెస్‌పై కిషన్ రె్డ్డి ఫైర్
రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 'హర్ ఘర్ తిరంగా', స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా కిషన్ రె్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీనికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని ఆయన తెలిపారు.

రుణమాఫీ కాలేదని వేలాది మంది రైతులు ఫోన్ చేసి చెబుతున్నారని, రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నట్లు వెల్లడించారు. వచ్చే నాలుగన్నరేళ్లు బీజేపీ నేతలు కష్టపడి పని చేయాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారన్న కిషన్ రెడ్డి.. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే రెండు విడతలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న మూడో విడతగా మొత్తం రూ. 2 లక్షల రుణ మాఫీ చేయనుంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications