అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!!

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడిన రాజగోపాల్ రెడ్డి వరుసగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల పైన వివక్ష చూపుతున్నారని ఫైర్ అయ్యారు. బిల్లుల కోసం మంత్రులు, సీఎం వద్ద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతని నిలదీశారు.

అసెంబ్లీ వేదికగా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే కేటాయిస్తున్నా రని.. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు, ప్రజలపై సీఎం, మంత్రులు వివక్ష చూపెడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. నిధులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకు, సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజక వర్గం కొడంగల్‌కు తరలిస్తున్నారని, అలాంటప్పుడు మిగిలిన నియోజకవర్గాలు, ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. బిల్లుల కోసం మంత్రులు, సీఎం వద్ద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతని నిలదీశారు. ఒక శాసనసభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డికి కూడా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు.

komatireddy-raja-goapl-reddy-questioned-govt-over-funds-allocation-for-mlas-in-assembly

మునుగోడుకు నిధుల పై రాజగోపాల్ రెడ్డి

హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతి ఎకరాకూ నీళ్లు ఇస్తున్నారని, ప్రతి ఐదువేల ఎకరాలకూ ఒక లిఫ్ట్‌ పెడుతున్నారని, కానీ తమ నియోజకవర్గానికి ఒక లిఫ్ట్‌లేదని, కాలువ లేదని, చెరువు లేదని ఇలాగైతే మునుగోడు ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. తనకు మాట్లాడటం చేతకాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత ప్రభుత్వం ఉండి కూడా తన ప్రజలకు న్యాయం చేయలేకపోతే, మాట్లాడక పోతే నేరమని అన్నారు. ఒకవేళ తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ పదవిలో ఉండటం కూడా అన్యాయమని, ఉండేందుకు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+