రేవంత్ రెడ్డి కష్టాన్ని బూడిదలో పోసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇది కదా రాజకీయం!!

రేవంత్ రెడ్డి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన పాదయాత్రల కష్టాన్ని నిముషాలలో ఆవిరి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో తలపడాలని టీ పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కెసిఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రగతి భవన్ గడీలు కూల్చేద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన, తెలంగాణాలో కేసీఆ ను గద్దె దించకపోతే ఏం జరుగుతుంది వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

ఓకే ఒక్క మాటతో రేవంత్ ప్రయత్నాన్ని నాశనం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఓకే ఒక్క మాటతో రేవంత్ ప్రయత్నాన్ని నాశనం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచాలని, ప్రజల్లోకి హస్తం గుర్తును బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకపక్కన ఇప్పటికే మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని, మళ్లీ బతికించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే.. ఆయన మాటలతో కాంగ్రెస్ పార్టీని లేవకుండా చావు దెబ్బ కొట్టాడు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బాసటగా రాకపోగా ఆయన ఏ ప్రయత్నం చేసినా ఒకే ఒక్క మాటతో దాన్ని ఫెయిల్ చేస్తున్నారు.

పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదని వ్యాఖ్యల టార్గెట్ రేవంత్ రెడ్డి నేనా!!

పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదని వ్యాఖ్యల టార్గెట్ రేవంత్ రెడ్డి నేనా!!

భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన జోస్యం చెప్పారు .ఏ పార్టీ కూడా 60 సీట్లను గెలవలేదని హంగ్ తప్పదు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడుతుందని, కొత్త వారైనా పాతవారైనా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ దూకుడు మీద కోమటిరెడ్డి బ్రదర్ నీళ్ళు

రేవంత్ దూకుడు మీద కోమటిరెడ్డి బ్రదర్ నీళ్ళు

ఇక ఈ వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి దూకుడు మీద నీళ్లు పోశాయి. ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళుతున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాలని, కెసిఆర్ ను గద్దె దించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులపై వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెండు అడుగులు ముందుకు వేస్తే, ఒక్కసారిగా ఆయనను వంద అడుగుల వెనక్కు లాగేసింది. ఇదెక్కడి పంచాయితీ రా అని రేవంత్ తల బాదుకునేలా చేస్తుంది.

మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్.. రేవంత్ ను కోమటిరెడ్డి వదలడా ?

మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్.. రేవంత్ ను కోమటిరెడ్డి వదలడా ?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నట్టుగా పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నాయకులు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలని, ప్రజాదరణ సాధించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, ఇక ఆ ప్రయత్నాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు విఫలమయ్యేలా చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+