నన్ను బలి చేయాలని చూస్తున్నారు, కెసిఆర్‌పై ఇంట్లో కూర్చొన్నా గెలుస్తా:కోమటిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనను బలి చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సోమవారం నాడుకోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు

ప్రతి ఒక్కరూ తననే టార్గెట్ చేశారని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేస్తే.. తాను ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో రెడ్లు, సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారని, రెడ్డి సామాజిక వర్గం టీఆర్‌ఎస్‌కు ఓటేయదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

komatireddy venkatreddy sensational comments on KCR

గజ్వేల్‌లో కేసీఆర్ కంటే తనకే ఎక్కువ మంది బంధువులు ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ నుండి పోటీ చేసి కూడ తాను సునాయాసంంగా విజయం సాధిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగం సమయంలో మార్షల్స్ వ్యవహరించిన తీరుతో తన కాలికి కూడ గాయమైందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అధికార పార్టీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా తమపై దాడికి పురికొల్పారని కోమటిరెడ్డి ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will ready to contest from Gajwel Assembly segment said Nalgonda MLA Komatireddy venkat reddy on Monday. Komatireddy chitchat with media at Assembly premises.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి