కొండా కపుల్ వర్సెస్ జిల్లా కాంగ్రెస్..సోనియాగాంధీ సాక్షిగా!
రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మాత్రం మారడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొండ సురేఖ వర్సెస్ జిల్లా కాంగ్రెస్ వార్ కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న సందర్భం అయినా అది ప్రజలందరికీ తెలిసేలా చర్చనీయాంశం అవుతుంది. తాజాగా మరోమారు జిల్లా కాంగ్రెస్ వర్సెస్ కొండా సురేఖ వివాదం కొనసాగుతుంది.
మారని సురేఖ తీరు.. వరంగల్ లో చర్చ
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎన్నికై, జిల్లా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ జిల్లాలోని నాయకులందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకత్వం భావిస్తోంది. కానీ ఆమె అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని తాజా పరిణామాలతో మరోమారు స్పష్టమైంది. ఇప్పటికే అనేక వివాదాలతో రాజకీయంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కొండా సురేఖ తీరు మాత్రం మారడం లేదు అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.

సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్
తాజాగా నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గం లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, రెండు వర్గాలుగా విడిపోయి చేయడమే ఈ చర్చకు కారణమైంది. జిల్లా కాంగ్రెస్ పక్షాన పోచమ్మ మైదాన్ కూడలిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల వరంగల్ జిల్లాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎంపికైన ఆయుబ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను చేశారు.
జిల్లా కాంగ్రెస్ వేడుకలలో కనిపించని కొండా వర్గం
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో ఈ జన్మదిన వేడుకలలో భాగస్వామ్యం తీసుకున్నారు. మంత్రిగా కొండా సురేఖ ఫోటో పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు వేయించి మరీ జిల్లా కాంగ్రెస్ పక్షాన జన్మదిన వేడుకలు చేశారు. కానీ కొండా సురేఖ వర్గం ఈ వేడుకలలో పాలు పంచుకోలేదు.

సురేఖ వర్గం ఒంటెద్దు పోకడలు
రైల్వే స్టేషన్ ఆవరణలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కొండ సురేఖ వర్గం నిర్వహించింది. కేక్ కటింగ్ తో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది కావాలని చేసిన చర్యగా స్థానికంగా చర్చ జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ కు పోటీగా కొండా సురేఖ వర్గం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ లో కనీసం జిల్లా అధ్యక్షుడి పేరు కూడా కనిపించలేదు. సురేఖ వర్గం ఒంటెద్దు పోకడలపై అసహనం వ్యక్తం అవుతుంది.

సురేఖ వైఖరి మింగుడు పడని సీనియర్లు
కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడిని గౌరవించే సంస్కృతి కూడా కొండా సురేఖ వర్గానికి లేదని స్థానిక నాయకత్వంలో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనూ ఆమె వైఖరి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్న వీరంతా మళ్లీ ఏదో ఒక రోజు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications