సీఎం, అవినీతి ఆరోపణల మంత్రులపై చర్యలు తీసుకోవాలన్న కొండా సురేఖ ధైర్యంపై చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా తనపై చర్యల కంటే ముందే సీఎం రేవంత్ రెడ్డిపై, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని మళ్లీ సంచలనం సృష్టించారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఒత్తిడి పెరగడంతో ఆమె ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. ఢిల్లీ వేదికగానూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనుక ధైర్యం ఏమిటి అన్నది చర్చ జరుగుతుంది.

కొండా సురేఖ కుమార్తె మాటల దుమారం

ఆగస్టు 19న వరంగల్‌లో జరిగిన కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం టికెట్‌పై సీఎం నిర్ణయాలను ప్రశ్నించారు. సీఎం అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి, హెచ్చరికలు జారీ చేశారు. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Konda Surekha challenges CM Revanth Reddy high command in dilemma about konda surekha issue

షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానం

వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సహా పలువురు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కొండా సురేఖ నాకు తన కుమార్తె వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కు తీసుకోవాలని సమాధానం ఇచ్చారు. అయినా కొండా సురేఖ కుమార్తె మాటలను ఖండించలేదు.

ఢిల్లీలో కొండా సురేఖ చెప్పిందిదే

సెప్టెంబర్ 2-3, 2026న అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లను కలిశారు. మీడియాతో మాట్లాడుతూ నా కుమార్తె మాట్లాడినదానికి నాపై చర్యలు తీసుకోవద్దు. ఆమె స్వతంత్ర వ్యక్తి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆమె అభిప్రాయాలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదని చెప్పానని అన్నారు.

రేవంత్ రెడ్డిని, ఇతర మంత్రులను టార్గెట్ చేసిన కొండా సురేఖ

నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎం అని ఎలా చెప్పగలరు? ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇవ్వాలో సీఎం ఎలా నిర్ణయిస్తారు?
భట్టి విక్రమార్క, పొంగులేటి వంటి వారిపై కమీషన్ల ఆరోపణలు ఉన్నా చర్యలు తీసుకోరా? బీసీ మహిళకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
ఆమెను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని, అధిష్ఠానం నిర్ణయం కోసం చూస్తున్నానన్నారు.

కాంగ్రెస్ పాలనలో మైనస్ లను ఎత్తి చూపిన సురేఖ

సీఎం, పార్టీలోని బలమైన వర్గాల ఒత్తిడి బీసీ మంత్రులపై, ఇతరులపై ఉందని సురేఖ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది అధిష్టానం దగ్గర గత కొంత కాలంగా ఉన్న అంశంగా చర్చ జరుగుతుంది. తన కుమార్తె వ్యాఖ్యలను పూర్తిగా తన నుంచి వేరు చేస్తూ, స్త్రీ స్వాతంత్ర్యం, రాహుల్ గాంధీ మాటలను గుర్తు చేస్తున్నారు. బీసీ మహిళగా తనను లక్ష్యం చేసుకున్నారని, పార్టీలో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని బహిరంగంగా చెప్పారు.

సురేఖ ధైర్యం వెనుక... రాజకీయ వర్గాలలో చర్చ

అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర మంత్రులపై చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నించడం వంటి అనేక కారణాలు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు తన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, మంత్రిగా తనది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పటం, తాను పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధినని కూడా చెప్పటం సురేఖ ధైర్యం వెనుక ఉన్న కారణాలుగా చర్చ జరుగుతుంది.

తెలంగాణాలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి శుభవార్త!
తెలంగాణాలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి శుభవార్త!

కాంగ్రెస్ అధిష్టానానికి చాలా సెన్సిటివ్ అంశంగా కొండా సురేఖ వ్యవహారం

బలమైన వాయిస్ వినిపించి కాంగ్రెస్ అధిష్టానాన్ని డోలాయమాన స్థితిలోకి నెట్టిన సురేఖ తనపైన వేటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను కచ్చితంగా బాహాటంగా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వంటివారు సీఎం కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్న వేళ మరికొన్ని అసమ్మతి గళాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. కనుక సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి చాలా సెన్సిటివ్ అంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+