టికెట్ అడ్డుకుంది కేటీఆరే! ఆగం చేసేందుకే కోటరీ: కొండా సురేఖ, ‘ఇష్టం లేకున్నా హరీశ్ రావు’
హైదరాబాద్: తన పేరును తొలి జాబితాలో ఎందుకు ప్రకటించలేదో టీఆర్ఎస్ అధిష్టానం సమాధానం చెప్పాలని వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

24గంటల్లో సమాధానం రావాలి..
శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొండా మురళితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తమ నిర్ణయాన్ని రెండు మూడు రోజుల్లో చెబుతామని కొండా సురేఖ చెప్పారు. 24గంటల్లో టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని గడువు విధించారు. తాము ప్రతి సమస్యను కేటీఆర్, హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

కేటీఆర్ ఆహ్వానిస్తే.. ఇష్టం లేకున్నా హరీశ్ రావే మద్దతిచ్చారు
తనకు టికెట్ ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాల్సిందేనని కొండా సురేఖ అన్నారు. ఈ విషయంపై తెల్లారి నుంచి కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్పారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం హరీశ్ రావుకు ఇష్టం లేదు కానీ, పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కంటే.. కూడా ఆయనే కొంత మద్దతుగా ఉన్నారని చెప్పారు.

టికెట్ రాకుండా అడ్డుకుంది కేటీఆరే..
తమకు టికెట్ రాకుండా అడ్డుకుంది కేటీఆర్ అని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆరే అంత నడిపిస్తున్నారని అన్నారు. సురేష్ రెడ్డి లాంటి వ్యక్తులకు కూడా ఇప్పడు తనకు ఎదురైన అనుభవమే ఎదుర్కోక తప్పదని అన్నారు.

టికెట్ రాకుంటే.. మూడు స్థానాల్లో పోటీ చేస్తాం..
తాము పార్టీ మారితే అందరికీ చెప్పే మారతామని కొండా సురేఖ స్పష్టం చేశారు. తమకు టికెట్ రాకుంటే స్వాంత్రత్య అభ్యర్థులుగా తమ కుటుంబ సభ్యులు మూడు స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. వరంగల్, తూర్పు పరకాల, భూపాలపల్లి స్థానాల నుంచి పోటీ చేస్తామని అన్నారు.

తెలంగాణను ఆగం చేసేందుకే కేటీఆర్ కోటరీ..
తాము టీఆర్ఎస్ పార్టీని వీడితే ఆ పార్టీకే నష్టం కానీ, తమకు కాదని కొండా సురేఖ స్పష్టం చేస్తారు. ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తున్నారని కొండా సురేఖ ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఎందుకిస్తున్నారని నిలదీశారు. వీరందరికీ టికెట్లు ఇచ్చి కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఆగం చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications