వివాదాల "కొండా": నాడు జగన్ కోసం రాజీనామా నుంచి నేడు కుమార్తె కోసం బర్తరఫ్ వరకు...!!

కొండా సురేఖ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. సీనియర్ రాజకీయ నాయకురాలే అయినా.. వివాదాల కారణంగా పదవులు కోల్పోయారు. పలు పార్టీలు మారారు. రెండు సార్లు మంత్రిగా ఉంటూనే మధ్య లోనే వదులు కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. నాడు రోశయ్య నుంచి నేడు రేవంత్ వరకు అందరితోనూ వివాదాలు కొనసాగించారు. జగన్, కేటీఆర్ కోసం పని చేసి వారితోనూ వైరం పెంచుకున్నారు. ఫలితంగా రాజకీయంగా ప్రతీ సందర్భం లోనూ నష్టపోతున్నారు.

కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. కాంగ్రెస్ లో వైఎస్ హయాంలో తొలి సారి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో గెలిచిన సురేఖకు వైఎస్ మంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ మరణం తరువాత జగన్ కు మద్దతుగా నిలిచారు. రోశయ్య సీఎంగా ఉండగా తాను మంత్రిగా పని చేయలేనంటూ.. జగన్ ను సీఎం చేయాలనే డిమాండ్ తో 2009 అక్టోబర్ 29న అప్పటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత జగన్ తో కలిసి ఆయన పార్టీ కోసం పని చేసారు. 2012లో పరకాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, టీఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి బిక్షపతి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అచ్చిరాని దేవాదాయ శాఖ, రాజకీయ భవిష్యత్ క్లోజ్ - సెంటిమెంట్ రిపీట్..లిస్టులో..!!
అచ్చిరాని దేవాదాయ శాఖ, రాజకీయ భవిష్యత్ క్లోజ్ - సెంటిమెంట్ రిపీట్..లిస్టులో..!!

{image-kondasurekkhain-68771788434744.jpg telugu.oneindia.com

వివాదాలకు అడ్రస్ గా కొండా

జగన్ మహబూబాబాద్ వచ్చిన సమయంలో తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, రాళ్ల వర్షం కురుస్తున్నా కొండా సురేఖ వెనకడుగు వేయకుండా జగన్ కోసం అక్కడ నిలబడ్డారు. ఆందోళనకారులపైకి ఆమె గన్‌మెన్లు కాల్పులు జరపడం, సురేఖ స్వయంగా రాళ్లు రువ్వడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక, రాష్ట్ర విభజన తరువాత జగన్ పైన విమర్శలు చేసి టీఆర్ఎస్ లో చేరారు. తిరిగి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి మంత్రి పదవి దక్కించుకున్నారు. కాగా.. మంత్రిగా ఉంటూ కేటీఆర్ వ్యక్తిగత జీవితంపై, టాలీవుడ్ నటుల విడాకులపై కొన్ని వివాదాస్పద మరియు అసభ్యకర ఆరోపణలు చేశారు. నటుడు నాగార్జున కుటుంబం కూడా పరువునష్టం దావా వేసింది. ఇక.. ఇప్పుడు కుమార్తె సీఎం రేవంత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించలేని పరిస్థితుల్లో కుమార్తెకు మద్దతుగా నిలుస్తూ.. రేవంత్ పైన చేసిన సంచలన ఆరోపణలతో ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఇక.. ఇప్పుడు రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+