నా కంటే ముందు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి - ఢిల్లీలో సురేఖ సంచలనం..!!
కొండా సురేఖ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. నేరుగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సురేఖ పైన చర్యలు తీసుకొనేందుకు హైకమాండ్ సిద్దమైన వేళ సురేఖ ఏ మాత్రం తగ్గటం లేదు. తన మనసులోని అభిప్రాయాలను స్పష్టంగా తేల్చి చెప్పారు. పార్టీ చీఫ్ ఖర్గేతో సురేఖ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఆ తరువాత రేవంత్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పైన చర్యలు తీసుకొనే ముందు సీఎం రేవంత్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటం ఆసక్తి కరంగా మారింది.
కొండా సురేఖ ఢిల్లీ వేదికగా నో కాంప్రమైజ్ అంటున్నారు. ఢిల్లీ వేదికగా నేరుగా సీఎం రేవంత్ పైనే గురి పెట్టారు. ఢిల్లీలోనే సీఎంతో సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు మకాం వేసారు. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ సుదీర్ఘంగా సురేఖ వ్యవహారం పైన చర్చించారు. ఢిల్లీలోనే ఉన్న సురేఖ పార్టీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అంశాలను వివరించారు. ఆ తరువాత మీడియాలో చిట్ చిట్ లో సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు.

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తన పైన ఎలా చర్య తీసుకుంటారని ప్రశ్నించారు. రాహుల్ పదే పదే మహిళలు స్వతంత్రంగా బతకాలని చెబుతూ ఉంటారని.. ఇప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీసీ అయిన తన పైనే చర్యలు ఉంటాయా.. రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తన్న ఇతర వర్గాలకు చెందిన వారి పైన ఉండవా అంటూ ప్రశ్నించారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా చెబుతారని సురేఖ నిలదీస్తున్నారు.
ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెబుతున్న రేవంత్ పైన ర్యలు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు. తన బిడ్డ ను రెచ్చగొడితే స్పందించిందని .. ఇదే విషయాన్ని తాను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా వివరించానని చెప్పుకొచ్చారు. పరకాల టికెట్ గురించి ఎలా ప్రకటన చేస్తారని సురేఖ ప్రశ్నిస్తున్నారు. తన పైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్ పైన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎంకు ఏ హక్కు ఉందని పరకాల అభ్యర్దిని ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ చేసే పనులు.. వ్యాఖ్యలు పార్టీ క్రమ శిక్షణా కిందకు రావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానని.. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని వ్యాఖ్యానించారు. సురేఖ వ్యాఖ్యలతో ఇక సీఎం రేవంత్ తో తాడో పేడో తేల్చుకొనే విధంగానే ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. హైకమాండ్ ఏ చర్య తీసుకున్నా.. తాను సిద్దమని సురేఖ తేల్చి చెబుతున్నారు. ఇక.. సురేఖ తాజా వ్యాఖ్యలతో హైకమాండ్ నిర్ణయం ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది.














Click it and Unblock the Notifications