బండి సంజయ్! నా బొచ్చు.. కిడ్నీ కూడా ఇస్తా: చెప్పుతో కొట్టుకుంటావా? కేటీఆర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ పార్టీ నుంచి విమర్శలు, సవాళ్లు రావడం.. ఈ పార్టీ నుంచి ప్రతి విమర్శలు, ప్రతి సవాళ్లు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చెప్పు దెబ్బలకు సిద్ధమేనా? అంటూ బండికి కేటీఆర్ సవాల్
ఇటీవల బండి సంజయ్ చేసిన డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. డ్రగ్స్ పరీక్ష కోసం తాను రక్తం ఇచ్చేందుకు సిద్ధమని.. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానన్నారు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా? అని బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు.
బొచ్చుకూడా ఇస్తానంటూ బండి సంజయ్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
'ఫాల్తు మాటలు, ఫ్లాల్తు రాజకీయాలు..హౌలాగాళ్లు చేస్తరు కానీ, మేము చేయం. డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా..? నా రక్తం, నా చర్మం తీసుకుపోతాడా..? ఏం తీసుకుపోతడో తీసుకపొమ్మను. నా వెంట్రుకలు కూడా ఇస్తా.
నేను బయటకు చిత్తశుద్ధితో వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా..? నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా..? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడ్నే ఉంటాను. రమ్మను. ఏ డాక్టర్ను తీసుకోస్తడో తీసుకురమ్మను.
నా వెంట్రుకలు, నా రక్తం, నా గోర్లు, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా. ఆయనకు ఏమైనా తెలివి ఉందా? ఇదేం రాజకీయం.. మనిషా పశువా.. కరీంనగర్‌కు ఏం చేసిండో చెప్పనికి చేత కాదు.. కానీ అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు' అని బండి సంజయ్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్.. సవాళ్లు, ప్రతిసవాళ్లు
అయితే, అంతకుముందు తనను తంభాకు తింటున్నారని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని.. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని ఇటీవల బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తంభాకు పరీక్ష కోసం తాను తన వెంట్రుకలు, కిడ్నీ, రక్తం, అవసరమైతే గుండె కూడా కోసిస్తానని.. బీఆర్ఎస్ వాళ్లు తాను తంభాకు తింటున్నానని నిరూపించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను లవంగం తింటే తంభాకు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, కేటీఆర్ డ్రగ్స్ పరీక్ష కోసం వెంట్రుకలు ఇస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజా సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications