కవిత లేఖపై కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

మాజీ సీఎం, బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కవిత చేసిన వ్యాఖ్యల పైన, కవిత లేఖ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయవచ్చని వెల్లడించారు.

ప్రతీపార్టీలో కోవర్టులు ఉంటారు: కేటీఆర్
అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడుతూ ఉంటేనే మంచిదని పేర్కొన్నారు. ప్రతీ పార్టీలో కోవర్టులు ఉంటారని సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయట పడతారని ఆయన తెలిపారు.ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకుపడిన ఆయన అధిష్టానానికి డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ktr counter to kavitha letter and made sensational comments on kavitha and revanth reddy

Take a Poll

రేవంత్ మాటల సీఎం కాదు, మూటల సీఎం
రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని, మూటల సీఎం అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దోచి పెడుతున్నాడని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎం గా మారిందన్నారు. బిల్డర్ లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు.. బీఆర్ఎస్ పై నిందలు అన్న చందంగా నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈడీ చార్జ్ షీట్ లో రేవంత్ పేరు.. రాజీనామా చెయ్
పీసీసీ చీఫ్ పదవి కోసం 50 కోట్లు చెల్లించాలని ఢిల్లీకి మూటలు మోసి పదవులు కొనుక్కున్నాడు అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి గతంలోనే ఆరోపించారు అని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్ లు ఉన్నారని ఒకరు రాహుల్ గాంధీ కాగా మరొకరు మోడీ అంటూ పేర్కొన్నారు. ఈడీ చార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు ఉందని, రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ ను కాపాడుతుంది కేంద్రప్రభుత్వమే
ఈడీ చార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు ఉండడం పైన రేవంత్, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు కేంద్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకున్నారని, మరి రేవంత్ ఎందుకు ఇంకా పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. గత మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ టాక్స్ నడుస్తోందని ప్రధాని మోడీ అన్నారని, దీనిపైన ఎందుకు విచారణ చేయట్లేదు చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+