ఇన్ని సున్నాలా!!: రేవంత్ రెడ్డిపై వీడియోలతో కేటీఆర్ సెటైర్లు

మూసీ అభివృద్ధికి రూ.లక్షా యాభై వేల కోట్లతో చర్యలు చేపడతామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తొలుత రూ.50,000 కోట్లు, తర్వాత రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఏకంగా రూ.లక్షా 50 వేల కోట్లు అని చెప్పడం వెనక ఉద్దేశమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ వీడియోలతో కూడిన ట్వీట్ చేశారు.

తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు పెడితేనే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు మూసీ సుందరీకరణకే రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా!! 15,000,000,000,000 అనిఆశ్చర్యం వ్యక్తం చేశారు కేటీఆర్.

KTR hits out at CM Revanth Reddy About Musi Development estimation cost

ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని? అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి, ఎంతోమంది రైతులకు మేలు చేసే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంటే మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువని కేటీఆర్​ నిలదీశారు.

చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం? లండన్‌​లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? చెప్పండి ముఖ్యముఖ్యమంత్రి అని కేటీఆర్​ నిలదీశారు. మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం, కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అని విమర్శించారు.

మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించం అని కేటీఆర్ హెచ్చరించారు. తట్టెడు మన్ను తీయకముందే.. రూ. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట, బ్యాక్ డోర్‌​లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని, కుంభకోణాల కాంగ్రెస్​‌కు కర్రుగాల్చి వాతపెడుతుందని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+