రేవంత్ తెలంగాణ సీఎం కావడం మన ఖర్మ, దౌర్భ్యాగ్యం: కేటీఆర్ విమర్శల దాడి

తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌కు తెలంగాణ ఆత్మ, రాష్ట్రంపై గౌరవం లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోడీ సాక్షిగా దాడి చేశారన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు మాజీ మంత్రి కేటీఆర్.

'రేవంత్ కు తెలంగాణ "ఆత్మ"లేదు. తెలంగాణపై "గౌరవం" అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ "ఆత్మగౌరవం"పై మోడీ సాక్షిగా... రేవంత్ దాడి' అంటూ విమర్శించారు. అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు.. ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం' అంటూ కేటీఆర్ విమర్శల దాడి చేశారు.

ktr hits out at cm revanth reddy his words on gujarat development

'అసలు "గోల్ మాల్ గుజరాత్ మోడల్" కు.. "Golden తెలంగాణ మోడల్"తో పోలికెక్కడిది.. ఘనమైన "గంగా జెమునా తెహజీబ్ మోడల్" కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే "గోద్రా అల్లర్ల మోడల్" నీకు నచ్చిందా..?' అని కేటీఆర్ ప్రశ్నించారు. నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్ పై.. నిప్పులు !.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. గొప్పలా ? ఇదేం నీతి.. ఇదేం రీతి..' అంటూ విమర్శించారు.

'తెలంగాణ మోడల్ అంటే.. "సమున్నత సంక్షేమ నమూనా".. "సమగ్ర అభివృద్ధికి చిరునామా".. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్.. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను.. నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?' అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

'నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ "ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..".. నేడు "తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..".. నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+