పంజాగుట్ట పేరు మార్పుపై కేటీఆర్ ఆసక్తికకర వ్యాఖ్యలు

హైదరాబాద్: అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని.. ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటైందన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు మహబూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని అన్నారు కేటీఆర్. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజునే ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ambethkar

దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. అది అంబేద్కర్ విగ్రహం కాదు.. విప్లవరూపమన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదని.. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని మంత్రి వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం సాహసోపేతమైనదన్నారు. అంబేద్కర్ ప్రవచించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే దాన్ని ఒంటపట్టించుకుని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత వివరిస్తూ, బోధిస్తూ.. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో నడవాలన్నారు. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని కేటీఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+