పోలింగ్ వేళ మంత్రి కేటీఆర్ భారీ ప్రణాళికలు - శాఖ మార్పు..!!

తెలంగాణ ఎన్నికల ప్రభావం రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధికి తోడు రానున్న కాలంలో మరింతగా అమలు చేయాల్సిన ఆలోచనలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదే సమయంలో విజయవాడ - హైదరాబాద్ మధ్య రాపిడ్ రైల్ సర్వీసు గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ సమయం కోల్పోయాం : తెలంగాణ వచ్చిన తొమ్మదిన్నారేళ్ల కాలంలో కోవిడ్...ఎన్నికల కారణంగా రెండున్నారేళ్ల సమయం కోల్పోయామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. పట్టణాలతో పాటు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తమ పాలనపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అంశాలు లేవు..అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నారని విశ్లేషించారు. తమకు తెలంగాణ పై మమకారం ఎందని..అహంకారం కాదని స్పష్టం చేసారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ పట్ల ప్రజల్లో ఆరాధనా భావం ఉందన్నారు. నిజం చెప్పాలంటే 2014లోనే రాష్ట్రంలో మార్పు వచ్చిందని చెప్పిన కేటీఆర్..ఇప్పుడు ప్రత్యేకంగా మార్పు కావాలని కోరుకుంటున్నది రాజకీయ నిరుద్యోగులేనని వివరించారు.

KTR Interesting Comments on Metro Expansion and Rapid Rail system in Hyderabad

భారీ ప్రణాళికలు ఉన్నాయి : ప్రజలు ప్రస్తుతం జరుగుతన్న మంచి పనులు కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. అహంకారం అంటూ ఉన్నది ఈ దేశంలో ఎవరికైనా అంటే అది కాంగ్రెస్‌కు ఢిల్లీ దొరలకేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని... తెలంగాణ రాకతోనే మార్పు వచ్చేసిందన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గెలిచి.. మూడోసారి హ్యాట్రిక్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేసారు. హైదరాబాద్ అభివృద్ధికి మరిన్ని ఆలోచనలు ఉన్నాయని..అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో 24 గంటల మంచి నీటి సరఫరా..చుట్టు పక్కల శాటిలైట్ టౌన్ షిప్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ గురించి చెప్పుకొచ్చారు.

KTR Interesting Comments on Metro Expansion and Rapid Rail system in Hyderabad

గేమ్ ఛేంజర్ అవుతుంది :హైదరాబాద్ లో మెట్రో సేవలను అయిదేళ్ల కాలంలో 250 కిలో మీటర్ల మేర విస్తరిస్తామని కేటీఆర్ స్పష్టం చేసారు. మెట్రో డబుల్ డెక్కర్ తేవాలనే ఆలోచన ఉందన్నారు. వచ్చే ప్రభుత్వంలో తనకు టూరిజం శాఖ ఇవ్వాలని సీఎంను కోరుతానని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో రాపిడ్ రైల్ సిస్టం పైన అధ్యయనం చేస్తున్నామన్నారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్ సిస్టం రావాలని..దీని ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ గేమ్ ఛేంజర్ అవుతుందని కేటీఆర్ విశ్లేషించారు. 2036 లో హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహణ పైనా ప్రణాళిలు ఉన్నాయని కేటీఆర్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+