మీ ఏడుపే మా ఎదుగుదల.. కాళేశ్వరంపై ఆలోచింపజేసే పోస్ట్ పెట్టిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. దగా పడ్డ తెలంగాణ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం అంటూ సామాజిక మాధ్యమంలో ఆయన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేక, సాగునీరు అందక రైతులు పడుతున్న అవస్థలను సోషల్ మీడియా వేదికగా చెబుతున్న కేటీఆర్ తెలంగాణా రైతాంగానికి కాళేశ్వరం ఒక వరం అన్నారు.

వంకర బుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించిన కాళేశ్వరం
కాళేశ్వరాన్ని కుట్రలతో నాశనం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేటీఆర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మా కరువులకు, కన్నీళ్ళకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అంటూ పేర్కొన్న ఆయన తెలంగాణ తెర్లిపోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకర బుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి కన్ను కుట్టించిన మా వరప్రదాయని కాళేశ్వరం అంటూ తెలిపారు.

KTR interesting post on Kaleshwaram project

శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవనం
సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను, చెలకలు నదీ జనాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమని పేర్కొన్నారు. తలాపున గోదారి గలగల పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని వెల్లడించారు. శిధిల శివాలయం గా పాడుబడిపోయిన శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవనం ఇచ్చిన పుణ్య వరం కాళేశ్వరమని కొనియాడారు.

నిజాంసాగర్ నిండు కుండలా మార్చిన కాళేశ్వరం
నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాంసాగర్ ను నిండుకుండగా మార్చిన అండదండ కాళేశ్వరం అని తేల్చి చెప్పారు. మండుటెండల్లో చెరువులను మత్తళ్ళు దూకించిన మహత్యం కాళేశ్వరం కు ఉందని, మా తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం అంటూ పేర్కొన్నారు.

మీ ఏడుపే మా ఎదుగుదల
కాళేశ్వరం అంటే ఒక బారేజ్ కాదని తెలియని మీ అజ్ఞానం అంటూ కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా దెప్పిపొడిచారు. ఎక్కడో ఒక లోపం సహజం సరిదిద్దుకోగలం అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కుళ్ళు. కుతంత్రాలను దిష్టిచూపులను తట్టుకోగలమని, మీ ఏడుపే మా ఎదుగుదల అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కాళేశ్వరం గొప్పతనం చెప్పటం ద్వారా ప్రజలలోనూ ఆలోచన రేకెత్తించే ప్లాన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+