ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేడర్ కు కేటీఆర్ కీలక పిలుపు..!!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కీలక ప్రకటన చేసారు కేడర్ కు స్పష్టత ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి దిశా నిర్దేశం చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పు బట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేస్తారని వెల్లడించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం గ్రేటర్ పరిధిలోని ప్రతీ కాలనీ నుంచి కేడర్ కదలాలని కేటీఆర్ సూచించారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. పార్టీ ఓటర్లు గా ఉన్న వారికి విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ సాధించిన విజయాలు అసమాన్యమైనవని, అనితర సాధ్యమైనవని కొనియాడారు. 2017 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150కి 99 కార్పొరేట్ స్థానాలు గెలిచి బీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించిం దని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేశామన్నారు. 2023 అసెం బ్లీ ఎన్నికల్లోనూ ఓఆర్‌ఆర్ లోపల గులాబీ జెండానే ఎగిరిందని తెలిపారు. హైదరాబాద్ వాసుల ముందు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలతో ఉపయోగం లేదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ పైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచకం సృష్టించారని కేటీఆర్ అన్నారు. తన అన్న ఇంటిని కూల్చలేదని విమర్శిం చారు. ధనవంతుల ఇళ్లను ముట్టుకోలేదని తెలిపారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా హైడ్రా తన పనితీరు మార్చుకోలేదని అన్నారు. హైడ్రా దెబ్బ, రేవంత్ చేతగానితనానికి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనమైందని తెలిపారు. లక్ష మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదల కడుపు కాంగ్రెస్ కొట్టిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నా రని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీలను కట్టి మూసీలోకి వ్యర్థాలు పోకుండా చేశామని గుర్తుచేశారు. మూసీ కోసం ఇండ్లను కోల్పోయినవారు బూతులు తిడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications