కేటీఆర్ vs బండి వివాదం లో కీలక మలుపు, నెక్స్ట్ఇక..!!

తెలంగాణ రాజకీయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల అంశం కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ పార్టీ నేతలతో కీలక భేటీలు నిర్వహించారు. కాళేశ్వరం నివేదిక.. ఎమ్మెల్సీల పై అనర్హత వేటు కోసం ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి చేర్చు కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో కేటీఆర్ Vs బండి సంజయ్ వివాదం లో కీలక మలుపు తీసుకుంది. తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

కొద్ది రోజులు కేటీఆర్ - బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారం, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల(ఆగస్టు) 8వ తేదీన బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులను పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో తెలిపారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ktr-legal-notices-for-bandi-sanjay-over-his-comments-in-phone-tapping-case

కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా తాను అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించానని చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. అయినా, కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడుపైన అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ న్యాయవాదులు వివరించారు. ఇప్పుడు బండి ఈ నోటీసుల పైన ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+