ఈ వెకిలి పనులేంటి.. సీఎస్; వరంగల్ లో ఫ్లెక్సీ చూసి భగ్గుమన్న కేటీఆర్!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన పైన నిత్యం విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ తాజాగా వరంగల్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ పైన భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫ్లెక్సీ ఫోటోను పోస్ట్ చేసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తెలంగాణా రాజముద్ర మార్పు ఆలోచన
ఇక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అధికారిక రాజముద్రలో ప్రభుత్వం మార్పులు చెయ్యాలని నిర్ణయించిన విషయం తెలిసిందే . గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ కళాతోరణం, చార్మినార్ లతో కూడిన రాజముద్రను రూపొందించగా అందులో రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించి ఆ ముద్రను మార్పు చేయాలని నిర్ణయించారు. అయితే రాజముద్ర మార్పు ప్రతిపాదన మాత్రమే ఇప్పటివరకు జరిగింది.

కాకతీయ కళాతోరణం, చార్మినారు లేని రాజముద్రతో ఫ్లెక్సీ .. కేటీఆర్ ఆగ్రహం
రాజముద్రను మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అసలు రాజముద్ర ఏంటి అనేదానిని ఇప్పటివరకు ఎవరు? ఆమోదించలేదు.
ఇదే సమయంలో వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట వెలసిన ఫ్లెక్సీ పైన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ చేశారు చేశారు. తెలంగాణ రాజముద్ర లేకుండా ఫ్లెక్సీ పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. కాకతీయ కళాతోరణం, చార్మినారు లేని రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం పైన కేటీఆర్ పోస్ట్ చేశారు.
సీఎస్ కు మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న
ఇక ఆ పోస్టును సిఎస్ శాంతి కుమారికి ట్యాగ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అంతేకాదు ఈ వ్యవహారం పైన ఆయన సీఎస్ ను నిలదీశారు. ఇది అధికారిక నిర్ణయమా? లేక అనధికార నిర్లక్ష్యమా? అంటూ ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ ప్రశ్నించిన కేటీఆర్ తెలంగాణ కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి అంటూ నిలదీశారు.
రాజముద్ర మార్పుపై కేటీఆర్ సీరియస్
ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు ఎప్పుడు ఆమోదించారో చెప్పాలని ప్రశ్నించారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు వాడారో చెప్పాలన్నారు. దీనికి కారకులు ఎవరో కనుక్కొని వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఈ ముద్ర తో ఫ్లెక్సీ ని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసి ఉండరు అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది..












Click it and Unblock the Notifications