తాగునీటికి కూడా కష్టంగా ఉంటే మూసీ సుందరీకరణ ఎందుకు..!!

హైదరాబాద్ లో తాగునీటి అంశం పైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం పైన ప్రతి పక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. హైదరాబాద్‌లో తాగునీటికి కూడా కష్టంగా ఉంటే మూసీ సుందరీకరణ ఎందుకని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్‌ రెడ్డికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తప్ప రైతుల కష్టాలు పట్టడంలేదని కేటీఆర్‌ ఆరోపించారు.

హైదరాబాద్ లో తాగునీటి అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వాడుకోకుండా, ఎవరు అడిగారని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారని నిలదీశారు. అసలు డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టుకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ప‌బ్లిక్ హియ‌రింగ్ అని చెప్పి.. ప‌బ్లిక్ గొంతు నొక్క‌డం ఏ ర‌క‌మైన ప‌బ్లిక్ హియ‌రింగ్ అవుతుంద‌ని నిలదీసారు. ప్ర‌కారం మూసీ ప్రాజెక్టు ముసుగులో వేలాది ఎక‌రాల లూటీకి ఈ ముఖ్య‌మంత్రి తెర‌లేపారు.. అందుకే ప‌బ్లిక్ హియ‌రింగ్ అంటే ఉలిక్కి ప‌డుతున్న‌ారని కేటీఆర్ విమర్శించారు. ఒక వైపు క‌రువుతో రాష్ట్రం లోని అన్న‌దాత‌లు అల్లాడుతున్నారని వివరించారు.

వార‌ణాసి, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్- రిజర్వేషన్ షురూ, రూట్.. షెడ్యూల్..!!
వార‌ణాసి, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్- రిజర్వేషన్ షురూ, రూట్.. షెడ్యూల్..!!
ktr-questions-cm-revanth-reddy-over-musi-beautification-amid-hyderabad-drinking-water-shortage

ఎక్కడా లేని కరువు తెలంగాణలోనే

నీళ్లు లేక హైద‌రాబాద్ ప్ర‌జ‌లు మొత్తుకుంటుంటే 10 టీఎంసీల నీళ్లు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌లో నుంచి తీసుకొచ్చి మూసీలో పోస్తామని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. కర్ణాటక, ఏపీలో లేని కరవు తెలంగాణకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 30శాతం కమీషన్‌ సర్కార్‌ అని రాజ్‌గోపాల్‌రెడ్డే అన్నారని చెప్పారు. కొండా సురేఖ ఏం చేప్పారో తాను ఇంకా చూడలేదని అన్నారు. తనకు ఇంకా క్షమాపణ చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏపీలో తెలంగాణ కంటే ఎక్కువ కరవు ఉందని చెప్పుకొచ్చారు. సాగునీటికి దిక్కులేదు.. తాగునీటికి దిక్కులేదు.. కానీ 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చిమూసీలో పోసి సుంద‌రీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సైతం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+