లగచర్ల దాడి ఘటనను రేవంత్ రెడ్డి ఎలా మార్చారో చెప్పిన కేటీఆర్!
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల పైన దాడి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. లగచర్లలో ఫార్మా విలేజ్ కు సంబంధించి భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అధికారుల పైన అక్కడ స్థానికులు దాడికి పాల్పడడంతో మొన్న ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
రేవంత్ చేతగానితనం ఇది: కేటీఆర్
ఈ ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్లాన్ చెప్పారు. ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తామని, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించాలి అనే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇది బి ఆర్ ఎస్ పార్టీ పై జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.

అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే మూర్ఖత్వమే
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేయడం కోసం లగచర్లలో ప్రజాస్వామిక చర్యలకు దిగారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖత్వమే అని ఆయన మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డిని, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మహేందర్ రెడ్డి తో మాట్లాడడమే నేరమా?
లగచర్ల దాడి ఘటనను రేవంత్ రెడ్డి ఎలా మార్చాడో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి తో మాట్లాడడమే నేరమా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక విధానాల పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యమ కాలం నుంచి తాము ఎన్నో నిర్బంధాలను చూశామని ఇవి తమకు లెక్క కాదని కేటీఆర్ పేర్కొన్నారు.
అరెస్టులతో లగచర్ల లడాయి ఆపలేరు
మా పార్టీ నేత సురేష్‌తో మాట్లాడితేనే నేరమైతే.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అలాగైతే.. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని అదానిని రాహుల్ గాంధీ తిడుతున్నాడు మరి.. అదే అదానితో రాసుకుపూసుకు తిరుగుతున్న రేవంత్‌ని సీఎం పోస్టు నుంచి తప్పించాలా? వద్దా?అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేశారు. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications