చెప్పుతో కొట్టండి: కేటీఆర్, 'నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేశారు'
ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా లంచాలు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్: ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా లంచాలు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు పిలుపునిచ్చారు.
ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని దివిటిపల్లి వద్ద ఆయన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెప్పారు.

ఇళ్ల మంజూరులో దళారులను నమ్మవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే కొట్టాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
ఇలాంటి మంచి కార్యక్రమంపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. 33 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. త్వరలోనే మహబూబ్‌నగర్ పురపాలికలో పర్యటిస్తానన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఇరుకైన పడక గదితో ఇంటిని నిర్మించి పైన మూడు రంగులు వేయించిందని చురకలంటించారు.
పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదల ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. సామాజిక సమీకరణాలు పట్టించుకోకుండా పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.75,000 అందజేస్తున్నారన్నారు.
నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేసిన చరిత్ర మీది: సంపత్
కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించడం సరికాదని, అలా అన్న వారే కనుమరుగయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ అన్నారు.
సీమాంధ్రులతో అంటకాగే వారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరమని చెప్పారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలన్నారు. రాజకీయాలకు మచ్చ తెచ్చేలా కేటీఆర్ భాష ఉందన్నారు. నిర్మాతలు, కాలేజీల నుంచి డబ్బులు వసూలు చేసిన చరిత్ర మీది అన్నారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications