32 మెడికల్ కాలేజీల బదులు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టాల్సింది: కేటీఆర్ ట్వీట్ చర్చ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసే బదులు తన కోసం 32 యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేసివుంటే బాగుండేదని అన్నారు. ఈ సలహా పలువురు నెటిజన్ల నుంచి వచ్చిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు కేటీఆర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండే కేటీఆర్.. ఈ మేరకు ట్వీట్ చేసి రాజకీయాల్లో చర్చకు దారితీశారు.

కేసీఆర్‌పై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత తనకు చాలా రకాల ఫీడ్‌బ్యాక్‌లు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అయితే, అందులో తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఓ ఫీడ్‌బ్యాక్‌కు ఆదివారం ఆయన పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే బదులు కేసీఆర్ 32 యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకుని ఉంటే బాగుండేదని నెటిజన్లు సలహా ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. కనీసం ఆ ఛానెళ్లు కేసీఆర్ పై వస్తున్న నకిలీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఉపయోగపడేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

KTR tweet on politics; Netizens Comments on this tweet

కొందరేమో కేసీఆర్‌కు మద్దతు పలుకుతూ.. "నిజమే కేటీఆర్ జీ.. మెడికల్ కాలేజీలతో పాటు యూట్యూబ్ ఛానెళ్లు కూడా కేసీఆర్ ఏర్పాటు చేయాల్సింది. ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రచారాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేవి. ఈ యూట్యూబ్ క్యాంపెయినింగే పార్టీకి నష్టం కలిగించింది. దీన్ని నమ్ముకుని ఉంటే మనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి' అని కేటీఆర్‌కు అనుకూలంగా కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.


మరికొందరేమో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఏం నేర్చుకోలేదని మండిపడుతున్నారు. నకిలీ ప్రచారం అని చెప్పుకునే బదులు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాసేవ చేస్తే బాగుండేది . ఇంకో విషయమేంటంటే ఈ నకిలీ ప్రచారం అనే ఫీడ్‌బ్యాక్ మీ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచే వచ్చి ఉంటుంది కేటీఆర్ జీ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్షంగా సమర్థవంతంగా పోరాడాలని మరికొందరు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+