హైదరాబాద్‌లో OpenAI ప్రారంభానికి ఆఫర్..!!

ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నుంచి మరో అభ్యర్ధన అందింది. OpenAI తన కార్యకలాపాలు ప్రారంభించడానికి హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి భారతదేశ కార్యకలాపాలను ప్రారంభించాలని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్ లో త్వరలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ఈ అభ్యర్ధన చేసారు.

OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్‌ త్వరలో భారత్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేస్తానని తాజాగా ప్రకటించారు. వచ్చేనెల భారత్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. దీని పై స్పందించిన సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నగరానికి కేటీఆర్ స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా, OpenAI లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. ఈ నగరం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇందులో T-Hub, WE-Hub, T-Works, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ktr-urges-ceo-sam-altman-to-seta-openai-operations-from-hyderabad-details-here

ఐటీ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్‌కామ్ లాంటి అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని వివరించారు. ఇక్కడ సాంకేతిక, స్టార్టప్ రంగాలలో అపారమైన ప్రతిభ ఉందని ఆయన పేర్కొన్నారు. 2020ని "ఇయర్ ఆఫ్ AI" గా ప్రకటించడం అనేక AI-ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతిభ, ఇన్నోవేషన్, నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో AI విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు. దీంతో, హైదరాబాద్ కేంద్రంగా వస్తున్న అభ్యర్ధనల పైన ఎలాంటి స్పందన ఉంటుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+