నిజంగా పేదల కోసమైతే ఆ పని చేయండి.., మీనా బదిలీకి భూకుంభకోణం లింకు?: రేవంత్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అసైన్డ్ భూముల లెక్క తేల్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 63 వేల ఎకరాల అసైన్డ్‌ భూములున్నట్టుగా లెక్క తేలింది. అయితే ఈ అసైన్డ్ భూముల్లో ఎక్కువ భాగం కబ్జాకోరుల చేతుల్లోనే ఉన్నట్టు తేలడం గమనార్హం.

దాదాపు ప్రతీ గ్రామంలో 60శాతం మేర అసైన్డ్ భూమి ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన అసైన్డ్‌ భూములను రీ అసైన్‌ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చిలో మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇలాంటి తరుణంలో.. ప్రభుత్వం హుటాహుటిన చేస్తున్న ఆర్డినెన్స్ ప్రయత్నాల వెనుక భారీ భూకుంభకోణం ఉందని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.

పేదల కోసమే అయితే..:

పేదల కోసమే అయితే..:


ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఆర్డినెన్స్ నిజంగా పేదల కోసమే అయితే ముందు దీనిపై శాసనసభలో చర్చ జరపాలన్నారు రేవంత్. ఈ ఆర్డినెన్స్ 2007లోనే శాసనసభ ఆమోదం పొందినప్పటికీ.. న్యాయవాది బొజ్జా తారకం కోర్టుకు వెళ్లడంతో దీని అమలు ఆగిపోయిందని అన్నారు.

రిజిస్ట్రేషన్ల చట్టం-1908ని అనుసరించి.. అసైన్డ్‌ భూములను రిజిస్టర్‌ చేసినా చెల్లుబాటు కాదని, అలాంటప్పుడు రామేశ్వర్‌రావు, ఆయన బంధువుల పేరిట చేసిన రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయరని రేవంత్ ప్రశ్నించారు. వాటిని రద్దు చేసి వెంటనే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

'మై హోం' రామేశ్వర్‌రావు కోసమే:

'మై హోం' రామేశ్వర్‌రావు కోసమే:

అసైన్డ్ భూముల రీ-అసైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్‌ వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. సీఎం బినామీ అయిన మై హోం సిమెంట్స్‌ అధినేత రామేశ్వర్‌రావు, ఆయన బంధువులకు దోచిపెట్టేందుకే ఈ ఆర్డినెన్స్‌కు తెరలేపారని అన్నారు.

హడావుడి ఆర్డినెన్స్ ఎందుకు..:

హడావుడి ఆర్డినెన్స్ ఎందుకు..:

ప్రభుత్వం చెబుతున్నప్పుడు నిజమైన లబ్దిదారులకే అసైన్డ్ భూములను కేటాయించడం ప్రభుత్వ ఉద్దేశమైతే.. ఈ నెలలోనే బడ్జెట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాల్సింది అన్నారు. అలా కాకుండా.. హడావుడిగా శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసి మరీ ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు.

ఇవీ ఆరోపణలు:

ఇవీ ఆరోపణలు:

ఆర్డినెన్స్ విషయంలో తాను సీఎం పైనే ఆరోపణలు చేస్తున్నానని, కావాలంటే తనపై కేసులు పెట్టుకోవచ్చన్నారు రేవంత్. సీఎం బినామీ రామేశ్వర్ రావు, ఆయన బంధువులు.. శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి చుట్టుపక్కల 10 గ్రామాల్లో 4వేల నుంచి 5వేల ఎకరాల భూములను సేకరించారని, ఇందులో 1500-2000 ఎకరాలు అసైన్డ్ భూములేనని అన్నారు.

మీనా బదిలీ అందుకే..:

మీనా బదిలీ అందుకే..:


వేల ఎకరాల భూములను అప్పనంగా రామేశ్వర్‌రావుకు బదిలీ చేయడానికి కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఇందుకోసం తమ బంధువైన కలెక్టర్ ద్వారా కేసీఆర్ వ్యవహారాలను చక్కబెడుతున్నారని అన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల అవకతవకలకు సహకరించనందుకే ఐఏఎస్‌ అధికారి బి.ఆర్‌.మీనాను ఉన్నపళంగా బదిలీ చేశారని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior legislator A. Revanth Reddy on Monday alleged that the Chief Minister was issuing an ordinance, postponing the date from which the Prohibition of Transfer of Assigned Lands Act would be actionable in order to benefit a real estate giant who was a close associate of his.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి