ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్‌కు లైన్ క్లియర్
హైదరాబాద్: హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆస్తి పన్ను రూపంలో రూ. 12కోట్లు బకాయిని చెల్లించనందుకు స్టేడియాన్ని సీజ్ చేయనున్నట్లు ఐలా అధికారులు హెచ్‌సీఏ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో సోమవారం హైదరాబాద్-పంజాబ్ జట్ల మధ్య ఇక్కడ జరిగే మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడు కావడం, ఏర్పాట్లన్నీ పూర్తికావడంతో ఐలా అధికారులు ఇప్పటికైతే మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సుదీర్ఘ కాలంగా బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను చెల్లించకపోవడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కు షాక్ ఇచ్చేందుకు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) సిద్ధపడిన నేపథ్యంలో ఐపియల్ మ్యాచులకు ఆటంకం ఏర్పడుతుందని భావించారు.

బాకీలు చెల్లించకపోవడంతో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియాన్ని శనివారంనాడు సీజ్ చేస్తామని ఐలా ప్రకటించింది. హెచ్‌సిఎ తమకు 12 కోట్ల రూపాయల భారీ మొత్తం ఆస్తి పన్ను బకాయి పడిరదని ఐలా చెప్పింది. పన్ను చెల్లించకుండా హెచ్‌సిఎ జాప్యం చేస్తోందని ఐలా విమర్శిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 11, 15, 17 తేదీల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
అంతకు ముందు శనివారమే ఐపిఎల్ మ్యాచ్‌కు ముందే ఐలా అధికారులు స్టేడియాన్ని సీజ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఐలా అధికారులతో చర్చలు జరిపారు. దాంతో పన్ను బకాయిలు చెల్లించేందుకు ఐలా అధికారులు హెచ్‌సిఎకు మరింత గడువు ఇచ్చారు. అయితే, సోమవారంనాటి మ్యాచుకు ఆటంకం కలిగించరాదని ఐలా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications