క్యా సీన్ హై: మద్యం షాపులకు ముందు తాళాలు..వెనక నుండి అక్రమ దందాలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ప్రభావంతో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. ఇక నిన్నటి నుండి మరోమారు కేంద్రం లాక్ డౌన్ పొడిగించటంతో మే 3 వరకు నో లిక్కర్ అని తేల్చి చెప్పినట్టు అయ్యింది . ఇక ఓ వైపు కరోనా వైరస్ తో జనం భయాందోళన కు గురవుతుంటే మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మందుబాబులు . ఇక ఇదే అదునుగా మద్యం ప్రియుల లిక్కర్ అవసరాలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మద్యం వ్యాపారులు . జోరుగా అక్రమ మద్యం దందాకు తెరతీశారు .

దొంగ చాటుగా బ్లాక్ లో దందా చేస్తున్న వైన్స్ నిర్వాహకులు

దొంగ చాటుగా బ్లాక్ లో దందా చేస్తున్న వైన్స్ నిర్వాహకులు

లాక్ డౌన్ ప్రభావం వైన్స్ షాపుల మీద పడింది . లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. మద్యం షాపులకు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. వేసిన సీల్ వేసినట్టే ఉంటుంది. బయటకు చూడటానికి అసలు షట్టర్ తెరిచిన ఆనవాళ్ళు కనిపించవు. కానీ మద్యం షాపుల నుండి దొడ్డి దారిన మద్యం యధేచ్చగా అక్రమ రవాణా అవుతుంది . మద్యం అమ్మకాలు లేకపోవటంతో జిహ్వ చాపల్యం ఆపుకోలేకపోతున్న మద్యం ప్రియులు ఎక్కువ ధరలు ఉన్నా సరే మద్యం కొనుగోలు చేస్తున్న నేపధ్యంలో అధికారికంగా మద్యం అమ్ముకోవాల్సిన వైన్స్ యజమానులు అనధికారికంగా దొంగ చాటుగా బ్లాక్ లో దందా కొనసాగిస్తున్నారు .

లాక్ డౌన్ సాక్షిగా మద్యంపై నాలుగు రెట్లు అదనంగా వసూళ్ళు

లాక్ డౌన్ సాక్షిగా మద్యంపై నాలుగు రెట్లు అదనంగా వసూళ్ళు

మందుబాబుల పరిస్థితిని బట్టి నాలుగు రెట్లు అదనంగా ఛార్జీలు వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్ని రోజులు లాక్ డౌన్ తో కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడ్డారు చాలా మంది మద్యం వ్యాపారులు . ఫలితంగా అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణా రాష్ట్రంలోనూ అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. ఇక ఇబ్బడి ముబ్బడిగా మద్యం పట్టుకుంటున్నారు ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు. కార్టన్లు , కార్టన్లు లిక్కర్ స్వాధీనం చేసుకుంటున్నారు.

అక్రమ రవాణా అడ్డుకుంటే దాడులు చేస్తున్న దందా రాయుళ్ళు

అక్రమ రవాణా అడ్డుకుంటే దాడులు చేస్తున్న దందా రాయుళ్ళు

ఈ మద్యం అంతా లిక్కర్ షాపుల నుండి బయటకు వచ్చిన మద్యమే . ముందు సీల్ వేసి ఉన్నా వెనక నుండి లిక్కర్ అక్రమ దందా కొనసాగుతుంది. లాక్ డౌన్ సాక్షిగా అక్రమ మార్గంలో మద్యం రవాణా అవుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది . ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డు పడుతున్న వారిపై దాడులకు కూడా వెనకాడటం లేదు . ఇక మందుబాబులు కొనుగోలు చేసిన మద్యాన్ని ఇళ్ళకు తీసుకు వెళ్ళటానికి నానా చావు చస్తున్నారు.

 వేసిన సీల్ వేసినట్టే .. ఇబ్బడి ముబ్బడిగా పట్టుబడుతున్న లిక్కర్ ..

వేసిన సీల్ వేసినట్టే .. ఇబ్బడి ముబ్బడిగా పట్టుబడుతున్న లిక్కర్ ..

ఇటీవల హైదరాబాద్ లో మీడియా వాహనంలో కార్టన్ ల కొద్దీ మద్యం రవాణా అవుతున్న సమయంలో ఆ వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు కేసులు నమోదు అయ్యాయి. ఏపీలోనూ మద్యం అక్రమ రవాణాను అరికట్టటానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చాలా కష్టపడుతున్నారు. రాత్రికి రాత్రే లిక్కర్ షాపులలో జరుగుతున్న చోరీలు కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇక అక్రమ మద్యం రవాణాలో లిక్కర్ షాపుల నిర్వాహకుల పాత్ర చాలా ఉంది అని పోలీసులు భావిస్తున్నారు . తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క కరోనా లాక్ డౌన్ విధుల్లో బిజీగా ఉన్న పోలీసులు మరో పక్క ఈ మద్యం అక్రమ దందాతో తల పట్టుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+