తెలంగాణాలో ఈ పార్టీలకు లోక్ పోల్ సర్వే షాక్, వాళ్ళు ఫుల్ హ్యాపీ!!

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకుంటుంది. ఈరోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి.

లోక్ పోల్ సర్వే.. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే
తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయి అనే సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ఫలితాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్ పోల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 13నుండి 15స్థానాలను, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని, బిజెపి రెండు నుండి మూడు స్థానాలను, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

Lok poll survey shock for BRS and BJP majority seats for congress these are the facts and findings

తెలంగాణ ప్రీ పోల్ సర్వేలో ఓటర్లు పట్టం కట్టింది ఈ పార్టీకే
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1350 ఓటర్లను శాంపిల్ గా తీసుకొని సర్వే చేసినట్టు పేర్కొంది. తెలంగాణ ప్రీ పోల్ సర్వేలో ప్రజలు వేటి ఆధారంగా వివిధ పార్టీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించారో కూడా సర్వే పేర్కొంది.

కాంగ్రెస్ కు బలం పెంచిన అంశాలివే
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పైన ప్రజలకు విశ్వాసం కుదిరిందని, అంతేకాకుండా రాహుల్ గాంధీ క్రేజ్ గ్రామీణ తెలంగాణలో పెరిగిందని పేర్కొంది . మల్కాజ్గిరి, మెదక్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో,ముఖ్యంగా హైదరాబాద్ రీజియన్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరిగిందని, ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారుతుందని సర్వే పేర్కొంది.

బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి ఇలా
ఇక బిజెపిలో ఉన్న సిట్టింగ్ ఎంపీల పైన తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందని, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి సామాజికవర్గం, ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ అందిస్తున్న పథకాల వల్ల కాంగ్రెస్ వైపు మళ్ళుతుందని, కనీసం ఒక్క సీటు దక్కించుకోవడం కూడా కష్టమేనని సర్వే వెల్లడించింది.

కేసీఆర్ ప్రభావం ఉంటుందా?
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం లేదని, కెసిఆర్ ప్రభావం ఓటర్ల పైన లేదని, సీరియస్ గా తీసుకోకపోవడం బి ఆర్ ఎస్ కు మైనస్ గా మారిందని సర్వే వెల్లడించింది . కుల గణనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన బీసీలలో కాంగ్రెస్ వైపు బీసీలు ఎట్రాక్ట్ అయ్యేలా చేస్తుందని సర్వే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+