హైదరాబాద్-ఫ్రాంక్‌ఫర్ట్ డైరెక్ట్ ఫ్లైట్స్: వారంలో ఐదురోజులు
హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఇకపై నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్.. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించడంతో విమాన ప్రయాణంలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లయింది. వారానికి ఐదు రోజులపాటు (సోమ, మంగళ, బుధ, గురు, శని) ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
తిరుగు ప్రయాణంలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి LH 752 విమానం 10.55 గంటలకు బయల్దేరుతుంది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్‌తో కలిసి కొత్త విమాన సర్వీసులు ఒప్పందం కుదుర్చోవడం ఎంతో సంతోషంగా ఉందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ అన్నారు.

ఈ కనెక్టివిటీ ఫ్రాంక్‌ఫర్ట్‌ను సందర్శించే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే, ఫ్రాంక్ ఫర్ట్ మీదుగా యూరోప్, అమెరికా, కెనడా, దక్షిణ అమెరికాలోని వివిధ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ సర్వీసులు ఉపయోగపడతాయని ప్రదీప్ పణికర్ తెలిపారు.
మా ప్రయాణికులను హైదరాబాద్ నగరం నుంచి ప్రపంచ గమ్యస్థానాలకు అనుసంధానించడం మా ప్రాధాన్యత. ఆ దిశగా ఇది ఒక ముందడుగు అని, హైదరాబాద్ విమానాశ్రయానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని పణికర్ అన్నారు.
కాగా, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం నుంచి ఉత్తర అమెరికాకు నలభై శాతం మంది ప్రయాణికులు యూరోప్‌లో విమానాశ్రయాలను రవాణా కేంద్రాలుగా ఎంచుకున్నారు.












Click it and Unblock the Notifications