కేసీఆర్ ఇంత పిరికివాడా? ఆయన కలలో కూడా బండి సంజయ్: సీఎం శివరాజ్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్టు నిరసనగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ ఇంత పిరికివాడా?: శివరాజ్ సింగ్ చౌహాన్
కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదంటూ వ్యాఖ్యానించారు శివరాజ్ సింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు.. ఇప్పుడు కేసీఆర్ కూడా కంసుడిలాగే భయపడుతున్నారని ఆయన అన్నారు.

కేసీఆర్ కలలో కూడా బండి సంజయ్.. అంటూ శివరాజ్
'నీ అన్యాయ పాలనకు నిప్పు పెట్టేదాక విడిచిపెట్టం.. మా పార్టీ నేతలపై లాఠీ ఝుళిపిస్తావా.. నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టం.. మేము బిర్యానీ అనుకున్నావా.. తినడానికి.. పొట్టను చీల్చుకుంటూ వస్తాం.. కేసీఆర్'.. అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. 'నీకు నువ్ ఏమనుకుంటున్నావ్.. కేసీఆర్ కలలో కూడా బండి సంజయ్ వస్తున్నట్టున్నాడు.. కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి.. ఇంకా ఎవరన్న ఉంటే వారిని కూడా చేస్తాడేమో అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రధాని మోడీని సేల్స్ మాన్ అంటున్నాడు.. మోడీ సేల్స్‌మెనే... దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మీ హామీలేమయ్యాయి.?: శివరాజ్ సింగ్
'నీవు రెండో సారి సీఎంవే.... కానీ నేను నాలుగోసారి సీఎం అయ్యాను, సోనియాగాంధీ మాపై పోటీకి భయపడుతోంది.. పంజాబ్‌లో అన్యాయంగా ప్రధాని మోడీని అడ్డుకున్నారు. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ కేసీఆర్.. ఒకేలా తయారయ్యారు. కేసీఆర్ ముందు సమాధానం చెప్పు.. నిరుద్యోగులకు ఉద్యోగలిచ్చావా? నిరుద్యోగ భృతి ఇచ్చావా? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చావా? నువ్వొక భయపడే ముఖ్యమంత్రివి' అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు శివరాజ్ సింగ్ చౌహాన్.
Recommended Video

కేసీఆర్ పులి కాదు.. ఎలుక..: బండి సంజయ్‌కి తామున్నమంటూ శివరాజ్
'2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ నీకు చెప్తున్నా.. అంధకారం పోయి తెలంగాణలో వెలుగులు విరజిమ్మేలా చేస్తాం.. గుర్తుంచుకో.. ధర్మయుద్దం మొదలైంది' అని బీజేసీ సీనియర్ నేత శివరాజ్ వ్యాఖ్యానించారు. మీరు పోరాడండి బండి సంజయ్.. మేమున్నామన్నారు శివరాజ్. నీకో కథ చెప్తా.. విను కేసీఆర్.. ఒక ఋషి ఎలుకను పులిని చేసినట్టు.. నిన్ను ప్రజలు సీఎం చేస్తే.. వారిపైనే అన్యాయంగా కేసులు పెడతావా.? ఇంకా తెలంగాణను ఎంత దోచుకుంటావ్.. ప్రజలు పులిని.. తిరిగి ఎలుకగా చేయాల్సిన సమయం వచ్చేసింది. నీకు దమ్ము ఉంటే మమ్మల్ని తొక్కి చూపెట్టు కేసీఆర్' అంటూ శివరాజ్ సింగ్ సవాల్ చేశారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications