మహా కూటమి 2.0; కేసీఆర్ కు కొత్త టెన్షన్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాత, కొత్త పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయని భావించిన నేపథ్యంలో ఈసారి రాజకీయాలు ఎలా ఉంటాయో అని అందరూ భావించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కొన్ని కొత్త పార్టీలు, గతంలో పోటీ చేసిన పాత పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని భావిస్తే ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఈసారి ఎన్నికలలో పోటీని విరమించుకుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కూడా ఎన్నికల బరినుండి తప్పుకున్నారు.

maha kutami 2.0: New tension for BRS!!

దీంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవటం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుందని చర్చ జరుగుతుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకును పంచుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడం కోసమే ఈ రెండు పార్టీలు పోటీ నుంచి విరమించుకున్నాయని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తుంది.

చంద్రబాబు కాంగ్రెస్ కి మేలు చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ కు లబ్ది జరగడం కోసమే ఇలా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరంతా పోటీ నుంచి విరమించుకోవడంతో వీరందరి కలయికను మహా కూటమి 2.0 అని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. అయితే ఈ కూటమి కుట్రలను మరోసారి తిప్పి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణా కోసం పోరాటం చేసిన కేసీఆర్ ను ప్రజలు మర్చిపోరని కూడా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+