లిఫ్టులో చిక్కుకున్న డిప్యూటీ సిఎం, హోంమంత్రి
హైదరాబాద్: నగరంలోని ఓ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లిఫ్టులో చిక్కుకున్నారు. సోమవారం ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన వారు పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. సాంకేతిక లోపం కారణంగా ఆ లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది.
లిఫ్టు డోర్లు కూడా తెరుచుకోలేదు. దీంతో భద్రతా సిబ్బంది, ఆస్పత్రి వర్గాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. సుమారు 20 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం మహామూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లిప్టులోనే ఉండాల్సి వచ్చింది.

20నిమిషాల అనంతరం సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు డోర్లను తెరవడంతో డిప్యూటీ సీఎం, హోంమంత్రి బయటికి వచ్చారు. ఆ తర్వాత మెట్ల ద్వారానే వారు నడుచుకుంటూ పై అంతస్తుకు వెళ్లారు. కొత్తగా ప్రారంభించిన కారణంగానే లిఫ్టులో సాంకేతిక లోపం ఏర్పడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications