Maharashtra election results: రేవంత్ రెడ్డికి తెలంగాణాలో ముందుంది ముసళ్ళ పండుగ!

మహారాష్ట్రలో బిజెపి ప్రభంజనాన్ని సృష్టించింది . ఇండియా కూటమి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎన్డీఏ కూటమికి ప్రజలు తమ మద్దతును తెలిపారు. దీంతో బీజేపీ మహారాష్ట్రలో మంచి జోష్ లో ఉంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

రేవంత్ ఎన్నికల ప్రచారం చేసిన చోటా కాంగ్రెస్ ఓటమి
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ రేవంత్ ప్రచారం చేసినచోట కాంగ్రెస్ గెలవకపోవడం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ డబ్బులు కూడా పంపిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది.

Maharashtra election results Congress alliance defeat targets telangana cm Revanth Reddy

తెలంగాణా పాలన పట్ల మహారాష్ట్ర ప్రజల విముఖత
ఈ పరాజయం తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల ఇతర రాష్ట్రాల ప్రజల వైఖరికి అద్దం పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ, కర్ణాటకలోనూ కాంగ్రెస్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేసిన మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు.మహారాష్ట్రలో ఐదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన గారడీని ప్రజలు నమ్మలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించే గుణపాఠం చెప్పారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఈ అంశాల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం లేదని, ఇక మహారాష్ట్రలో 3000 ఇస్తామని చెప్పడంతో మహిళలు ఆ విషయాన్ని నమ్మలేదని భావిస్తున్నారు. తెలంగాణలో రైతు భరోసాను ఎగ్గొట్టటం, ఆసరా విషయంలో మోసం చేయడం, రైతు రుణమాఫీ విషయంలోనూ ఇప్పటికీ అందరూ రైతులకు రుణమాఫీ చెయ్యకపోవడం వంటి అనేక అంశాలు మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయని హరీష్ రావు వంటి నేతలు భావిస్తున్నారు.

రేవంత్ టార్గెట్ గా విమర్శలు
ఇక సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం తో తెలంగాణ రాష్ట్రంలోనూ ముందు ముందు రేవంత్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని తాజా ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+